Site icon HashtagU Telugu

WhatsApp Emoji: వారెవా వాట్సాప్..కొత్తగా ఎమోజీ రిప్లై ఆప్షన్.. గ్రూప్ సభ్యుల సంఖ్య డబుల్

Whatsapp emoji

Whatsapp emoji

వాట్సాప్ లో కొత్త ఫీచర్స్ వచ్చాయి చూశారా ? ఇప్పటివరకు ఏదైనా వాట్సాప్ మెసేజ్ కు జవాబు చెప్పాలంటే.. టెక్స్ట్ మెసేజ్ ను టైప్ చేయాల్సి వచ్చేది. ఇకపై అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీకు వచ్చిన మెసేజ్ పై లాంగ్ ప్రెస్ చేయగానే ఎమోజీ లు ప్రత్యక్షం అవుతాయి. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి పంపొచ్చు. ప్రస్తుతానికి 6 ఎమోజీలు మాత్రమే వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. భవిష్యత్ లో వీటి సంఖ్యను పెంచే అవకాశం ఉంది. వీటికి తోడుగా స్టిక్కర్ రియాక్షన్స్, జిఫ్ రియాక్షన్స్ ను కూడా అదనంగా జోడించాలని వాట్సాప్ యోచిస్తోంది. ఇతరుల వాట్సాప్ స్టేటస్ అప్ డేట్ లకు స్పందించేందుకు కూడా ఎమోజీ రియాక్షన్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే వాట్సాప్ బీటా వర్షన్ లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. స్టేటస్ అప్ డేట్ పై స్పందించేందుకు వాట్సాప్ డెస్క్ టాప్ వర్షన్ లో 8 ఎమోజీలు ఉంటాయని అంటున్నారు. Ios, android, whatsapp web వినియోగదారులకూ ఈ ఫీచర్ ను అందించాలని సంస్థ కసరత్తు చేస్తోంది.

2 జీజీ ఫైల్స్ ట్రాన్స్ ఫర్ కు లైన్ క్లియర్..

వాట్సాప్ లో ఇంత వరకు యూజర్లు ఒక్క విడత 100 ఎంబీ వరకే ఫైల్స్ పంపించు కునేందుకు అవకాశం ఉండేది. దీనివల్ల సమయం వృధా అయ్యేది. ఇప్పుడు ఈ పరిమితి 2 జీబీకి పెరిగింది. అంటే ఒకే విడత 2 జీబీ డేటాను మరొకరితో షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ గ్రూప్ సభ్యుల సంఖ్య డబుల్..

ఒక వాట్సాప్ గ్రూపులో గరిష్ఠంగా 256 మంది సభ్యులకే ఇప్పటి వరకు అనుమతి ఉండేది. ఇకపై 512 మంది సభ్యులు ఒకే గ్రూపులో చేరొచ్చు. అంటే సభ్యుల పరిమితి రెట్టింపైంది.

Exit mobile version