Whatsapp Clone: వాట్సాప్ క్లోన్ యాప్ తో జాగ్రత్త.. వాడారో మీ డాటా చోరీ అయినట్లే!

Whatsapp Clone: ఇండియాలో మొబైల్స్ వాడకం అంతకంతకు ఎక్కువవుతోంది. అదే సమయంలో మొబైల్స్ వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. హ్యాకర్లు మొబైల్స్ ద్వారా తమకు కావాల్సిన డాటాను దొంగిలిస్తున్నాయి. అయితే చాలా వరకు మాల్వేర్

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 07:25 PM IST

Whatsapp Clone: ఇండియాలో మొబైల్స్ వాడకం అంతకంతకు ఎక్కువవుతోంది. అదే సమయంలో మొబైల్స్ వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. హ్యాకర్లు మొబైల్స్ ద్వారా తమకు కావాల్సిన డాటాను దొంగిలిస్తున్నాయి. అయితే చాలా వరకు మాల్వేర్ యాప్ లతో డాటా చోరీకి పాల్పడుతున్నారు. ఇలా ఆండ్రాయిడ్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతున్న దేశాల జాబితాలో ఇండియా టాప్ లో ఉంది.

మాల్వేర్ ప్రొడక్షన్ & ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ అయిన ESET ఒక రిపోర్ట్ లో ఆండ్రాయిడ్ థ్రెట్ డిటెక్షన్లు 9.5శాతం పెరిగినట్లు తెలిపింది. ఇలా ఆండ్రాయిడ్ స్పై ఏజెంట్ ట్రోజన్ మాల్వేర్ ను ఎక్కువ గుర్తించిన దేశాల జాబితాలో ఇండియా కూడా ఉందని ఆ రిపోర్ట్ తెలిపింది. ఈ తరహా ట్రోజన్ ఏజెంట్లు మాల్వేర్ ఫైల్స్ లేదా కోడ్, గుర్తించని విధంగా మొబైల్స్ లోకి చేరి, మరో యాప్ లో కలిసి పోతాయని రిపోర్ట్ లో పేర్కొంది.

ఇలా మొబైల్ లోకి చేరిన ఏజెంట్ మాల్వేర్ ఫైల్స్ ఫోన్లోని వివిధ యాప్ ల ద్వారా రహస్యంగా ఆడియో, వీడియోలను రికార్డ్ చేయగలవని ESET తెలిపింది. మరీ ముఖ్యంగా ఇండియాలో వాడుతున్న జీబీ వాట్సాప్ అనే వాట్సాప్ క్లోన్ యాప్ ఇండియాలోని యూజర్ల డేటాను చోరీ చేస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ లను వాడటం వల్ల డాటా చోరీకి గురవుతోందని సదరు రిపోర్టులో వివరించడం జరిగింది.

నిజానికి గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండి, సేఫ్టీ నియమాలను పాటించే యాప్స్ ని మాత్రమే వాడాల్సి ఉంటుంది. కానీ రకరకాల ఫీచర్ల పేర్లతో చాలామంది గూగుల్ ప్లే స్టోర్ లో లేని యాప్ లను అంటే థర్డ్ పార్టీ యాప్ లను వాడటం వల్ల ఇలాంటి డాటా చోరీలు జరుగుతున్నాయి. APK ఫైల్స్ రూపంలో వేసుకునే యాప్స్ లో చాలా వరకు మాల్వేర్ ఫైల్స్ ఉంటున్నాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.