WhatsApp Chat Transfer : బ్యాకప్‌ అక్కర్లేదు.. పాత ఫోన్ నుంచి కొత్త ఫోనుకు ఛాట్ ట్రాన్స్‌ఫర్

WhatsApp Chat Transfer :  వాట్సాప్‌లోని ఛాట్‌ హిస్టరీని పాత స్మార్ట్ ఫోన్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేసుకోవడం ఇక ఈజీ.

  • Written By:
  • Updated On - January 29, 2024 / 07:31 AM IST

WhatsApp Chat Transfer :  వాట్సాప్‌లోని ఛాట్‌ హిస్టరీని పాత స్మార్ట్ ఫోన్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేసుకోవడం ఇక ఈజీ. ఎందుకంటే.. మనం బ్యాకప్‌ చేయకుండానే ఛాట్‌ హిస్టరీని కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఇందుకోసం మనం ‘వాట్సాప్ ఛాట్‌ ట్రాన్స్‌ఫర్‌’ అనే ఆప్షన్‌ను వాడాల్సి ఉంటుంది.  క్లౌడ్‌ ఆధారంగా పనిచేసే బ్యాకప్‌ కంటే ఈ ప్రక్రియ చాలా ఫాస్టుగా, ఈజీగా ఉంటుంది. ఈ ఫీచర్‌ను వాడటం కోసం  పాత ఫోన్, కొత్త ఫోన్ రెండు కూడా మీ దగ్గరే ఉండాలి.  ఆ రెండింటినీ ఒకే వైఫైకి కనెక్ట్‌ చేసుకోండి. అనంతరం సర్వీసును ఆన్ చేయండి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఫీచర్‌ను ఎలా వాడాలో తెలుసా ?

తొలుత మీ పాత ఫోన్‌లోని వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఛాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎంపిక చేయండి. ఆ వెంటనే ఛాట్‌ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ప్రక్రియ మీ పాత ఫోన్‌లో షురూ అవుతుంది. పాత ఫోన్‌లో ఒక క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది.  ఇక మీ కొత్త ఫోన్‌లోనూ వాట్సాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని పాత ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ కావాలి. పాత ఫోన్‌కు వచ్చే వెరిఫికేషన్‌ కోడ్‌ను కొత్త ఫోనులో ఎంటర్‌ చేయాలి.  ఆ వెంటనే కొత్త ఫోనులో ఒక క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను.. పాత ఫోన్‌లో చూపించే స్కానర్‌తో స్కాన్‌ చేయండి. ఇది జరిగిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే మీ పాత ఫోనులోని ఛాట్ హిస్టరీ (WhatsApp Chat Transfer) డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి వచ్చేస్తుంది. అయితే ఈ ప్రాసెస్ జరిగే టైంలో రెండు ఫోన్లను పక్కపక్కనే ఉంచాలి. స్క్రీన్‌లు కూడా ఆన్‌లో ఉంచడం మర్చిపోకండి.

Also Read :Plane Crash : కూలిన విమానం.. ఏడుగురి మృతి

చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత WhatsApp లో వీడియో కాల్ స్క్రీన్ షేర్ ఫీచర్‌ వచ్చేసింది. ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఉన్న ఈ ఫీచర్ వాట్సాప్‌లో అందుబాటులోకి రావడంతో వినియోగదారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో కాల్ స్క్రీన్ షేర్ ఫీచర్‌లో, మీరు వీడియో కాలింగ్ సమయంలో మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను అవతలి వ్యక్తితో షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచరును వాడేందుకు తొలుత మీ వాట్సాప్ ఖాతాను తెరవండి. దీని తర్వాత, డౌన్ డ్రాప్‌కి వెళ్లి అందుబాటులో ఉన్న ట్యాబ్‌ పై ప్రెస్ చేయండి. ఇప్పుడు కెమెరా స్విచ్ ఆప్షన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. దాని పై క్లిక్ చేసిన తర్వాత, స్క్రీన్ షేర్ ఫీచర్ చిహ్నాన్ని ప్రెస్ చేయాలి.ఇప్పుడు మీ ఫోన్ లో ఒక పాప్ – అప్ కనిపించిన తరువాత స్క్రీన్‌ను షేర్ చేయడానికి స్టార్ట్ నౌ పై ప్రెస్ చేయండి. దాంతో స్క్రీన్ షేర్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. మీరు మీ స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారని నిర్ధారించడానికి మీకు సందేశం కనిపిస్తుంది.