WhatsApp Channels : వాట్సాప్ ఛానల్స్‌లో రెండు కొత్త ఫీచర్లు

WhatsApp Channels : వాట్సాప్ మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకురాబోతోంది. ఆ రెండు నూతన ఫీచర్లు వాట్సాప్ ఛానల్స్ విభాగంలో రిలీజ్ కాబోతున్నాయి.

  • Written By:
  • Updated On - November 29, 2023 / 12:39 PM IST

WhatsApp Channels : వాట్సాప్ మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకురాబోతోంది. ఆ రెండు నూతన ఫీచర్లు వాట్సాప్ ఛానల్స్ విభాగంలో రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో మొదటిది ‘ఛానల్ అలర్ట్ స్క్రీన్’ ఫీచర్. వాట్సాప్ ఛానల్స్‌కు ఒక ప్రత్యేకమైన పాలసీ ఉంది. ఎలాంటి మెసేజ్‌లు పెట్టాలి ? ఎన్ని మెసేజ్‌లు పెట్టాలి ? అనే దానిపై నిర్దిష్ట నియమాలు ఉన్నాయి. వాట్సాప్ ఛానల్స్‌లో పోస్ట్ చేసే కంటెంట్‌పై అభ్యంతరం ఉంటే ఫిిర్యాదు (రిపోర్ట్)  చేసే వెసులుబాటు ఆ ఛానల్‌లో ఉండే యూజర్స్‌కు కూడా ఉంటుంది. ఇలా అన్ని మార్గాల నుంచి తమకు అందే సమాచారాన్ని రివ్యూ చేసి.. పాలసీకి విరుద్ధంగా నడుపుతున్న ఛానల్స్‌ను వాట్సాప్ సస్పెండ్ చేస్తుంటుంది. ఏవైనా వాట్సాప్ ఛానల్‌‌పై సస్పెన్షన్ వేటు వేయాలని వాట్సాప్ డిసైడ్ అయితే.. ఆ ఛానళ్ల నిర్వాహకులకు వార్నింగ్ మెసేజ్‌‌లను, అలర్ట్ మెసేజ్‌లను పంపుతుంది. ఈ వార్నింగ్ మెసేజ్‌లు.. ‘ఛానల్ అలర్ట్ స్క్రీన్’‌పై డిస్‌ప్లే కావడమే కొత్త ఫీచర్ ప్రత్యేకత.

We’re now on WhatsApp. Click to Join.

వాట్సాప్ ఛానల్ సస్పెన్షన్ సమయంలో ఛానెల్ లింక్ డీయాక్టివేట్ అవుతుంది. ఇప్పటికే ఉన్న ఫాలోయర్లు ఛానెల్ హిస్టరీని చూడలేరు. ఛానల్‌లోకి కొత్త అప్‌డేట్‌లు రావు. ఈవిధంగా వాట్సాప్ ఛానల్ సస్పెండ్ అయితే.. దాన్ని రివ్యూ కోసం వాట్సాప్‌కు సబ్మిట్  చేసే అవకాశాన్ని కల్పించేదే రెండో కొత్త ఫీచర్. దానిపేరే ‘వాట్సాప్ ఛానల్ రివ్యూ’.  వాట్సాప్ అల్గారిథమ్ తప్పిదం, ఇతర సాంకేతిక సమస్యలు, తప్పుడు ఫిర్యాదుల వల్ల ఛానల్ బ్యాన్ అయి ఉంటే వాట్సాప్ ‌ఛానల్‌పై విధించిన సస్పెన్షన్‌ను రివ్యూ చేయమని ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్‌ను అడగొచ్చు. భవిష్యత్తులో వాట్సాప్ కొత్త అప్‌డేట్‌లలో ఈ రెండు ఫీచర్లు కూడా రిలీజ్ అవుతాయి. ప్రస్తుతానికి వాట్సాప్ బీటాలో వీటిని టెస్ట్(WhatsApp Channels) చేస్తున్నారు.