Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్‌ కాల్స్‌ను రికార్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సూపర్ ట్రిక్ మీకోసమే?

Mixcollage 11 Jun 2024 02 21 Pm 1279

Mixcollage 11 Jun 2024 02 21 Pm 1279

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది.

ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసింది వాట్సాప్ సంస్థ. చాలామంది వాట్సాప్ ని వినియోగిస్తున్నారు కానీ అందులో ఉన్న ఫీచర్స్ గురించి చాలామందికి తెలియదు. ఆ సంగతి అటు ఉంచితే.. మీరు ఎప్పుడైనా వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆ కాల్ రికార్డు చేయాలనీ అనుకుంటున్నారా. కానీ ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్నారా. మరి వాట్సాప్ కాల్ ను ఎలా రికార్డు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీరు వాట్సాప్‌ కాల్‌ని స్వీకరించినప్పుడు లేదా ఎవరికైనా కాల్ చేసినప్పుడు కాల్ సమయంలో లేదా కాల్ చేసే ముందుగా మీ ఫోన్‌లో స్క్రీన్ రికార్డింగ్‌ను ప్రారంభించాలి. కానీ చాలా ముఖ్యమైన దశల్లో ఒకటి ఇది రికార్డింగ్ కోసం సౌండ్ ఆప్షన్‌ను చూపుతుంది. ఇందులో మీరు మీడియా, మైక్ ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ కాల్ రికార్డ్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా మీకు వీడియో కూడా చూపిస్తుంది. అయితే మీ వాయిస్ కొంచెం స్పష్టంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఈ రికార్డింగ్ మీ ప్రాథమిక అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇందులో మీరు అర్థం చేసుకోగలిగేంతగా వాయిస్‌ ని అర్థం చేసుకుంటారు. అయితే పైన చెప్పిన విధంగా మీరు వాయిస్ కాల్స్ మాత్రమే కాకుండా ఎవరిదైనా వీడియో కాల్స్ కూడా రికార్డ్ చేయవచ్చు. వీడియో కాల్‌ని రికార్డ్ చేయడానికి, అదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.

Exit mobile version