Site icon HashtagU Telugu

WhatsApp: మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. వారందరికీ గుడ్ న్యూస్!

Thumbs B C 903ee29c75027e0f5c58872661ab038d

Thumbs B C 903ee29c75027e0f5c58872661ab038d

WhatsApp: వాట్సాప్ తమ యూజర్ల భద్రత కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. గత కొన్ని రోజులకు ముందు వాట్సాప్ అనేక భద్రతా సమస్యలను ఎదుర్కొంది. అందుకే తమ యూజర్లకు మేలు చేసే పలు ఫీచర్లను రిలీజ్ చేస్తూ వాట్సప్ ముందుకు సాగుతోంది. వాట్సాప్ లో అభ్యంతరకర మెస్సేజులు పెట్టేవారిని బ్లాక్ చేసేందుకు వాట్సాప్ సులభమైన రీతిలో మరో ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం బీటా యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

వాట్సాప్ యూజర్లు తమకు నచ్చని వ్యక్తులను బ్లాక్ చేసుందుకు ఇకపై ఇబ్బంది పడాల్సిన పనిలేదు. అందుకోసమే వాట్సాప్ ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని టెస్టు చేసిన తర్వాత అందరికీ చేరువ చేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది. సాధారణ యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి రానుంది.

సాధారణంగా మన వాట్సాప్ లో మనకు అభ్యంతరకర మెస్సేజులు పెట్టేవారిని, లేదంటే మనకు నచ్చని వారిని మనం బ్లాక్ చేస్తూ ఉంటాం. అదే వారు మన కాంటాక్ట్ లిస్టులో ఉన్నట్లైతే చాట్ విండోలో ఆ వ్యక్తి చాట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేస్తే మెనూ కనిపిస్తుంది. అందులో మోర్ పైన క్లిక్ చేస్తే బ్లాక్ ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లైతే ఆ వ్యక్తి బ్లాక్ అవుతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి పంపే మెస్సేజులు ఏవీ రావు.

తాజాగా వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్ అంతసేపు పట్టదు. కొత్త ఫీచర్ ప్రకారంగా బ్లాక్ చేయాల్సిన వ్యక్తి చాట్ విండోను లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పైన ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేస్తే అందులో బ్లాక్ ఆప్షన్ వస్తుంది. అక్కడ బ్లాక్ చేస్తే ఆ వ్యక్తి పంపే మెస్సేజులు మీకు రావు. ఈ ఫీచర్ చాలా మందికి ఉపయోగపడుతుందని వాట్సాప్ తెలిపింది.