WhatsApp new update: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఐదు సరికొత్త ఫీచర్స్?

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకీ

  • Written By:
  • Publish Date - February 10, 2023 / 07:30 AM IST

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో అయితే రెండు రోజులకు ఒక కొత్త కొత్త అప్డేట్ ను పరిచయం చేస్తూనే ఉంది వాట్సప్ సంస్థ. కాగా ప్రస్తుతం వాట్సాప్ మెసేజ్, ఆడియో కాల్, వీడియో కాల్, స్టేటస్ వంటి ఫీచర్లు ఈ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్టేటస్ ఫీచర్ మరింత అనువుగా వినియోగదారులకు అందించేందుకు ఐదు కొత్త అప్ డేట్లను అందించింది వాట్సాప్ సంస్థ. మరి ఆ ఫీచర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాట్సాప్ లో చాలామంది వారికి ఇష్టమైన వాటిని అభిరుచులను వ్యక్తిగత విషయాలను సామాజిక విషయాలను స్టేటస్ ద్వారా పంచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు టెక్ట్స్, ఫొటోలు, వీడియోలను వాట్సాప్ స్టేటస్ కింద ట్యాగ్ చేసుకోవచ్చు. ఇక మీదట వాయిస్ మెస్సేజ్ లను సైతం స్టేటస్ కింద పెట్టుకోవచ్చు. 30 సెకండ్ల నిడివి ఉన్న వాయిస్ సందేశాలను రికార్డ్ చేసి వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోవచ్చు. ప్రైవేటు ఆడియన్స్.. అలాగే వాట్సాప్ లో మీరు ఇప్పటి వరకు స్టేటస్ లో పెట్టిన విషయాన్ని మీ కాంటాక్ట్ లిస్ట్ లోని అందరికీ కనిపిస్తుంది. కొత్త అప్ డేట్ ప్రకారం మీరు ప్రైవేటు ఆడియన్స్ ను సెట్ చేసుకోవచ్చు. అంటే మీ స్టేటస్ ను ఎవరు చూడవచ్చు. ఎవరు చూడకూడదు అని మీరే ఓ లిస్ట్ రెడీ చేసుకోవచ్చు. స్టేటస్ కూ రింగ్ టోన్.. అలాగే వాట్సాప్ మరో ఆసక్తికర అప్ డేట్ ను వినియోగదారులకు అందిస్తోంది.

అదే స్టేటస్ ప్రొఫైల్ రింగ్స్. ఇప్పటి వరకూ ఎవరైనా స్టేటస్ పెడితే అది మనకు చూసే వరకు తెలియదు. అయితే ఇకపై మీకు నచ్చిన వ్యక్తి స్టేటస్ పెట్టగానే తెలిసేలా ఓ రింగ్ టోన్ పెట్టుకోవచ్చు. ఈ ప్రొఫైల్ రింగ్ ఫీచర్ తో వాట్సాప్ లో మీకు ఇష్టమైన వ్యక్తి పెట్టే స్టేటస్ లు ఇక మీరు మిస్ అయ్యే చాన్స్ ఉండదు. లింక్ ని ప్రివ్యూ చూపిస్తుంది.. కాగా ఇప్పటి వరకూ మీరు స్టేటస్ లో ఏదైనా లింక్ పెడితే అది దాని ప్రివ్యూ మనకు కనిపించదు. అయితే కొత్త అప్ డేట్ లో యూఆర్ఎల్ లింక్ స్టేటస్ లో పేస్ట్ చేయగానే దాని ప్రివ్యూ స్టేటస్ లోనే కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు బాగా ఉపకరిస్తుంది.