Site icon HashtagU Telugu

Whatsapp: యూజర్స్ కి షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఒకేసారి అన్ని లక్షలు అకౌంట్స్ బ్యాన్?

Mixcollage 03 Dec 2023 09 27 Pm 5292

Mixcollage 03 Dec 2023 09 27 Pm 5292

ఇటీవల కాలంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు యూజర్స్కి షాక్ ఇస్తూ వాట్సాప్ అకౌంట్స్ ని బ్యాన్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని లక్షల అకౌంట్స్ ని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా కూడా మరోసారి వాట్సాప్ సంస్థ ఏకంగా 75 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసింది. వాట్సాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం భారతదేశంలో సుమారు 75 లక్షల కంటే ఎక్కువ నకిలీ అకౌంట్స్ నిషేదించింది.

2023 అక్టోబర్ 01 నుంచి 31 మధ్య 7548000 ఖాతాలను నిషేదించింది. వాట్సాప్ నెలవారీ నివేదికలో వివరించిన విధంగా 19,19,000 వినియోగదారు నివేదికల కంటే ముందుగానే నిషేధించడం జరిగింది. అక్టోబర్‌లో దేశంలో రికార్డు స్థాయిలో 9,063 ఫిర్యాదులను అందుకున్నట్లు సమాచారం. ఇందులో ఖాతాను నిషేధించడం లేదా గతంలో నిషేధించబడిన ఖాతాను పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. దేశంలో 500 మిలియన్ల కంటే ఎక్కువ వినియోగదారుల సంఖ్యను కలిగి ఉన్న వాట్సాప్ అక్టోబర్‌లో 9,063 ఫిర్యాదులను అందుకున్నట్లు వీటిపైన 12 చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే వాట్సాప్ ఒక ఖాతాను నిషేధించడం లేదా గతంలో నిషేధించిన దాన్ని పునరుద్ధరించడం వంటి పరిష్కార చర్యలను సూచిస్తుంది. వాట్సాప్ సెప్టెంబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొత్తం 7,111,000 ఖాతాలను బ్యాన్ చేసింది. ఇందులో వినియోగదారు నివేదికలను స్వీకరించడానికి ముందు 2,571,000 ఖాతాలు ముందస్తుగా నిషేధించారు. అప్పుడు వచ్చిన ఫిర్యాదుల్లో అకౌంట్ సపోర్ట్ (1,031), బ్యాన్ అప్పీల్ (7,396), అదర్ సపోర్ట్ (1,518), ప్రొడక్ట్ సపోర్ట్ (370), సేఫ్టీ (127) వంటి కేటగిరీల్లో 10,442 యూజర్ రిపోర్ట్‌లను స్వీకరించినట్లు సమాచారం.

Exit mobile version