WhatsApp: 30 రోజుల్లో 16 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్.. ఎందుకంటే?

లక్ష కాదు.. 2 లక్షలు కాదు.. 16 లక్షలకుపైగా వాట్సాప్ ఖాతాలను ఈ ఏడాది ఏప్రిల్ లో బ్యాన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - June 1, 2022 / 10:23 PM IST

లక్ష కాదు.. 2 లక్షలు కాదు.. 16
లక్షలకుపైగా వాట్సాప్ ఖాతాలను ఈ ఏడాది ఏప్రిల్ లో బ్యాన్ చేసినట్లు వాట్సాప్ వెల్లడించింది. ఇబ్బందికరమైన కంటెంట్ ఏదైనా కనిపిస్తే వినియోగదారులే ఫిర్యాదు చేయడమే కాకుండా.. సదరు కాంటాక్ట్‌ను బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమకు ఫిర్యాదులు అందిన పలు వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేశామని పేర్కొంది.

ఈ క్రమంలోనే వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, అనలిస్టులు, రీసెర్చర్లు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నిపుణులు, ఆన్‌లైన్ సేఫ్టి, టెక్నాలజీ డెవలప్‌మెంట్ నిపుణులతో కూడిన బృందాలను నియమించామని వెల్లడించింది. భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 5 లక్షల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు కలిగి ఉన్న డిజిటల్ కంపెనీలు ఈ వివరాలను ప్రతి నెలా ప్రచురించాల్సి ఉంటుంది. వీటిని అనుసరించి నడుచుకునే క్రమంలోనే ఏప్రిల్ నెలకు సంబంధించిన వివరాలను వాట్సాప్ వెల్లడించింది. ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌ సేవల్లో తాము ఇండస్ట్రీ లీడర్‌గా ఉన్నామని వాట్సాప్ తేల్చి చెప్పింది.