Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై ఆ ఫీచర్ తో కేటుగాళ్ళకు చెక్ పెట్టండిలా?

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వాట్సాప్ ని వినియోగిస్తూనే ఉన్నారు. రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండటంతో వాట్సాప్ సంస్థ కూడా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. సరికొత్త ఫీచర్ లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది వాట్సాప్ సంస్థ. ఇది ఇలా ఉంటే తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ.

ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా వాట్సాప్‌లో సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ అనే కొత్త గోప్యతా ఫీచర్‌ను ప్రకటించింది. ఇటీవలి తెలియని నంబర్ల నుండి వచ్చిన కాల్స్‌ పై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేటుగాళ్ల మోసాలకు ఆగడాలకు చెక్ పెట్టేలా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. మెటా ఫౌండర్‌, సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్ ప్రకటన ప్రకారం వినియోగదారులకు ఇన్‌కమింగ్ కాల్‌లపై ఎక్కువ నియంత్రణ ఇవ్వడం,స్కామ్స్‌ బారిన పడకుండా సెక్యూరిటీ అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం. సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్‌తో, వాట్సాప్ యూజర్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అవాంఛిత కాల్‌లను ఆటోమేటిక్‌గా స్క్రీన్ అవుట్ చేయవచ్చు అని వాట్సాప్‌ తెలిపింది.

దీంతో మోసాలు బాగా తగ్గుతాయని వెల్లడించింది. ఇకపోతే ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది అన్న విషయానికి వస్తే.. సెటింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌ సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్‌నోన్‌ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ ఫోన్‌లో రింగ్ అవ్వవు. కానీ కాల్ లిస్ట్‌లో కనిపిస్తాయి. ఫలితంగా ఏదైనా ముఖ్యమైన కాల్స్‌ విషయంలో వినియోగదారులు తర్వాత రివ్యూ చేసుకోవచ్చు.