WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మరో శుభవార్త.. ఇకపై పెద్ద ఫైల్ అయిన పంపించేయచ్చు?

ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లోనే కాల

  • Written By:
  • Publish Date - May 30, 2023 / 05:45 PM IST

ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లోనే కాలక్షేపం చేస్తున్నారు. చాటింగ్, వీడియో కాల్ ఇతర అవసరాల కోసం వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడంతో వాట్సాప్ సంస్థ కూడా నెలలో దాదాపు నాలుగు ఐదు రకాల కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేంటంటే.. వాట్సాప్ లో కేవలం 16ఎంబీ లోపు ఉండే ఫైళ్లను మాత్రమే షేర్ చేసేందుకు అనుమతి ఇస్తుంది.

అంతకుమించిన ఫైళ్లను వేరే వాళ్లకు పంపాలంటే దాని కోసం జీమెయిల్ గానీ మరో ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను కానీ వినియోగిస్తున్నాము. అయితే ఈ సమస్యలకు వాట్సాప్ చెక్ పెట్టింది. ఇక పై పెద్ద ఇమేజ్ లు , ఆడియో ఫైళ్లు, వీడియోలు, వాయిస్ నోట్లు అన్ని 2జీబీ అంటే 2000ఎంబీ వరకూ పంపుకోవచ్చని ప్రకటించింది. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాట్సాప్ ద్వారా విస్తృత సంఖ్యలో ఫొటోలు, వీడియోలు షేర్ అవుతాయి. అవి పెద్ద సైజ్లో ఉంటే వినియోగదారుల ఫోన్ స్టోరేజ్ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. అందుకే వాట్సాప్ ఇంతకాలం పెద్ద ఫైళ్లను అనుమతించలేదు. అయితే వినియోగదారుల అభ్యర్థనల మేరకు వాట్సాప్ ఇప్పుడు ఫైల్ సైజ్ లిమిట్ ని సవరించింది.

ఇప్పుడు 2జీబీ వరకూ ఉండే ఫైల్ ఏదైనా వాట్సాప్ నుంచి పంపించుకోవచ్చు. అది ఆండ్రాయిడ్, ఐఓఎస్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ దేనిలో అయినా ఇదే సైజ్ లో పంపుకోవచ్చు. మరి ఆండ్రాయిడ్ లో ఎలా పంపించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం మొదటిగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. చాట్ స్క్రీన్ ని ఓపెన్ చేసి మీరు ఫైల్ పంపాలనుకొంటున్న కాంటాక్ట్ లేదా గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోండి..అటాచ్ మెంట్ ఐకాన్ పై క్లిక్ చేసి, టెక్ట్స్ బాక్స్ లో డ్యాక్యుమెంట్ ఐకాన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన ఫైల్ ని 2 జీబీ వరకు సైజ్లో ఎంపిక చేసుకోవచ్చు. ఫైల్ ఎంపిక చేసుకున్న తర్వాత అది కన్ఫర్మేషన్ అడుగుతుంది. అది ఒకే చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయండి. అది అప్ లోడ్ అవడానికి కొద్ది సమయం పడుతుంది. అయితే అది త్వరగా సెండ్ అవడం అన్నది మీ నెట్ వర్క్ స్పీడ్ ని ఇది ఆధారపడి ఉంటుంది.