Site icon HashtagU Telugu

Whatsapp New Shortcuts: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. కొత్తగా 4 టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్?

Mixcollage 22 Feb 2024 07 25 Pm 5647

Mixcollage 22 Feb 2024 07 25 Pm 5647

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. తాజాగా వాట్సాప్ కొత్త ఫంక్షనాలిటీ లను తీసుకొచ్చింది.వాట్సాప్ వినియోగదారులకు ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

మరీ ముఖ్యంగా అధికారిక కమ్యూనికేషన్‌ల కోసం ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగిస్తుంటే.. మీ టెక్స్ట్‌లలో ఏదైనా విషయాన్ని హైలెట్ చేయవచ్చు. మీ మెసేజ్‌ లలో బుల్లెట్, నంబర్, బ్లాక్ కోట్ లేదా ఇన్‌లైన్ కోడ్ చేసేలా నాలుగు టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్ లను ప్రకటించింది. వీటిని ఉపయోగించడానికి సాధారణ షార్ట్‌కట్స్ ఉపయోగించి చేయవచ్చు. ఇప్పటికే ఇప్పటికే బోల్డ్, స్ట్రైక్‌త్రూ, ఇటాలిక్, మోనోస్పేస్ షార్ట్‌కట్‌లు అందుబాటులో ఉండగా అదనంగా మరో నాలుగు వచ్చి చేరాయి. కాగా వాట్సాప్ సంస్థ యూజర్ల కోసం బుల్లెట్ లిస్టు, నంబర్ లిస్ట్, బ్లాక్ కోట్, ఇన్‌లైన్ కోడ్ అనే నాలుగు కొత్త ఫార్మాటింగ్ షార్ట్‌కట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పటినుంచి వాట్సాప్ ఆండ్రాయిడ్, వెబ్, ఐఓఎస్, మ్యాక్, డెస్క్‌టాప్ యాప్‌లోని వినియోగదారులుఅందరూ ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఈ షార్ట్‌కట్స్ ద్వారా చాట్‌లో టెక్స్ట్ కొత్త ఫార్మాట్ రూపంలో మార్చుకోవచ్చు. అయితే, పర్సనల్, గ్రూపు చాట్‌లలో సపోర్టుతో పాటు, ఛానెల్‌లలోని అడ్మిన్‌లకు కూడా ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మీరు స్లాక్ యూజర్ అయితే స్లాక్‌లో మినహా ఈ ఫార్మాటింగ్ ఆప్షన్లను టెక్స్ట్ బార్‌కు పైభాగంలో ఉన్న ఐకాన్ లేదా షార్ట్‌కట్స్ రెండింటి ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫార్మాటింగ్ ఆప్షన్ల విషయానికి వస్తే..

మొదటిది బుల్లెట్ లిస్ట్ ఏదైనా టెక్స్ట్‌ను పాయింట్లలో బుల్లెట్ జాబితా మాదిరిగా మార్చుకోవచ్చు. మీరు బుల్లెట్ చేయాలనుకుంటున్న టెక్స్ట్ ముందు ‘-‘ ఐకాన్ టైప్ చేయండి. ఆ తర్వాత అది ఆటోమాటిక్‌గా బుల్లెట్ ఐకాన్‌గా మారుతుంది. అప్పుడు మీరు షిఫ్ట్ +ఎంటర్ చేస్తూనే ఉండాలి. అది ఆటోమాటిక్‌గా నెక్స్ట్ బుల్లెట్ పాయింట్‌ అవుతుంది.

నంబర్‌డ్ లిస్ట్… వాట్సాప్‌లో రెండో షార్ట్‌కట్.. నంబర్‌డ్ లిస్ట్. ఇది బుల్లెట్‌ లిస్టు మాదిరిగా ఉంటుంది. దీన్ని ఉపయోగించడానికి, 1, 2 లేదా 3 సంఖ్యలను టైప్ చేయండి. ఆ తర్వాత స్పేస్ ఇచ్చి ఏదైనా టెక్స్ట్ టైప్ చేయండి. బుల్లెట్ జాబితా మాదిరిగానే ఇక్కడ షిఫ్ట్ +ఎంటర్ ప్రెస్ చేయాలి . దాంతో అది నెక్స్ట్ నంబర్‌కి ఆటోమాటిక్‌గా లిస్టు అవుతుంది.

బ్లాక్ కోట్.. ఏదైనా ముఖ్యమైన టెక్స్ట్ హైలైట్ చేయడానికి లేదా మెసేజ్‌లలో ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి బ్లాక్ కోట్‌ ని ఉపయోగించవచ్చు. మీరు > ఐకాన్ పక్కన కొంచెం స్పేస్‌ బార్ ఇచ్చి ఏదైనా టైప్ చేయాలి. అక్కడ మీకు బ్లాక్ కోట్ మాదిరిగా టెక్స్ట్ హైలెట్ అవుతుంది.