వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఇకపై వాయిస్, వీడియో కాల్స్ అలా?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను కోట్లాదిమంది వినియోగదారులు వినియోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 04:49 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను కోట్లాదిమంది వినియోగదారులు వినియోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా ప్రతిరోజు ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగించే మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ కూడా ఒకటి. అయితే ఇప్పటికే వాట్సాప్ అంతా ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది.

కాగా ఇప్పటికే ప్రైవసీ విషయంలో, వాట్సాప్ స్టేటస్ విషయంలో, ప్రొఫైల్ ఫోటో విషయంలో, వాట్సాప్ గ్రూపుల మెసేజ్ ల విషయంలో ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ తాజాగా వీడియో కాల్ వాయిస్ కాల్ ల విషయంలో కూడా తాజాగా ఒకసారి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఆ యాప్‌లో వీడియో, వాయిస్‌ కాల్‌ల కోసం ఇతరులను ఆహ్వానించేందుకు ప్రత్యేక లింక్‌లను ఉపయోగించుకోవచ్చు.

లింక్‌పై క్లిక్‌ చేసిన వెంటనే కాల్‌లో చేరేందుకు ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. వాట్సప్‌లోని కాల్‌ సెక్షన్‌లోకి వెళ్లి లింక్‌ను సృష్టించొచ్చు. ఇందుకోసం యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్‌ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ సోమవారం ఫేస్‌బుక్‌ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు. వాట్సప్‌లో ఒకేసారి 32 మంది గ్రూప్‌ వీడియోకాల్‌ మాట్లాడుకునేందుకూ వీలు కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.