WhatsApp: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఫోటోని కూడా బ్లర్ చేసుకోవచ్చు?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి

  • Written By:
  • Publish Date - October 27, 2022 / 05:15 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకొని వస్తోంది వాట్సాప్ సంస్థ. ఈ నేపథ్యంలోని తాజాగా వినియోగదారుల కోసం మరొక సరికొత్త ఫ్యూచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేమిటంటే ఇమేజ్ బ్లర్ టూల్‌.

ఈ ఇమేజ్ బ్లర్ టూల్ ని డెస్క్ టాప్‌ బీటా యూజర్ ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ని త్వరలో యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. మరి ఈ ఇమేజ్ బ్లర్ టూల్ ఫీచర్ ఇలా పని చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా కొందరు డెస్క్‌టాప్ బీటా యూజర్ లకు ఈ సదుపాయాన్ని వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ బ్లర్ టూల్ ద్వారా మరింత సెక్యూర్ గా ఇమేజ్ ను షేర్ చేసుకోవచ్చు.

అయితే ఫోటోని సెండ్ చేయడానికి ముందు ఆ ఫోటోలోని ఏదైనా భాగాన్ని టూల్ సహాయంతో బ్లర్ చేసుకోవచ్చు. కాగా త్వరలోనే ఈ ఇమేజ్ బ్రదర్ ను మొబైల్ బీటా వెర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్ సంస్థ. అయితే ఈ ఇమేజ్ బ్లర్ టూల్ టెస్టింగ్ అంతా పూర్తి అయిన తర్వాత వాట్సాప్ యూజర్ లందరికి కూడా ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్ సంస్థ.