Smart Phones: గంటలకు మించి మొబైల్ ఫోన్ చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 09:15 AM IST

టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు గంటల కొద్దీ ఈ మొబైల్ ఫోన్ ముందే గడుపుతున్నారు. అయితే మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగించవద్దు అని నిపుణులు చెబుతున్నప్పటికీ ఆ మాటను పెడుతున్న పెట్టి మరి వినియోగిస్తున్నారు. అయితే మొబైల్ ఫోన్ ని ఎక్కువ సేపు వినియోగించడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అని తెలిసి కూడా అలవాట్లను మానుకోవడం లేదు.

అయితే మొబైల్ ఫోన్ ను రెండు గంటలకు మించి చూస్తే ఏం జరుగుతుంది. ఎటువంటి సమస్యలు వస్తాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొబైల్ ఫోను రెండు గంటలకు నుంచి ఎక్కువగా ఉపయోగించడం వల్ల నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మొబైల్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడు పై ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా కంటి చూపు కూడా దెబ్బతింటుంది.

రెండు గంటలకు మించి మొబైల్ ఫోన్ వైపు అలాగే తలవంచి చూడటం వల్ల మెడ నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఎక్కువసేపు మొబైల్ ఫోను వినియోగించడం వల్ల ఫిట్స్ లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అందుకే ఈ తరం చిన్నపిల్లలకు చిన్న ఏజ్ నుంచే కళ్లద్దాలు వస్తున్నాయి. అలాగే మొబైల్ ఫోను ఎక్కువగా చూడటం వల్ల వాటికే ఎడిక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది అని నిపుణులు చేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ ను ఎక్కువగా చూడటం వల్ల మెడ, నరాలపై, కంటి చూపు పై ఎక్కువ ప్రభావం చూపుతోంది.