Twitter’s Suspension: ట్విట్టర్ కొత్త సస్పెన్షన్ పాలసీ ఏమిటి? తెలుసుకోండి

ఫిబ్రవరి 1 నుంచి ట్విట్టర్ ఖాతా సస్పెన్షన్‌లను అప్పీల్ చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది.

  • Written By:
  • Updated On - February 1, 2023 / 12:21 PM IST

ఫిబ్రవరి 1 నుంచి ట్విట్టర్ ఖాతా సస్పెన్షన్‌లను అప్పీల్ చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. ఖాతా పునరుద్ధరణ కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యొక్క కొత్త ప్రమాణాల ప్రకారం మూల్యాంకనం చేయబడుతుంది. ఇకపై ప్లాట్‌ఫారమ్ ఖాతాలపై తక్కువ తీవ్రమైన చర్యలే ఉంటాయని ట్విట్టర్ స్పష్టం చేసింది. దాని విధానాల యొక్క “తీవ్రమైన” లేదా “పునరావృత” ఉల్లంఘనల కోసం మాత్రమే సస్పెన్షన్‌లను రిజర్వ్ చేస్తామని తేల్చి చెప్పింది.

* ఖాతా సస్పెన్షన్‌లపై Twitter కొత్త విధానం

ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించి నందుకు శాశ్వత సస్పెన్షన్ విధించడం అసమంజసం అనేలా ఉన్న కొన్ని విధానాలను గుర్తించినట్లు ట్విట్టర్ గత ఏడాది డిసెంబర్‌లో తెలిపింది. అటువంటి విధానాలను ఉల్లంఘించినందుకు తాత్కాలికంగా నిలిపివేసిన ఖాతాలను పునరుద్ధరించడం ప్రారంభించామని పేర్కొంది. అయితే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, హాని లేదా హింస బెదిరింపులు, పెద్ద ఎత్తున స్పామ్ మరియు ప్లాట్‌ఫారమ్ మానిప్యులేషన్‌లో నిమగ్నమైన ఖాతాలను పునరుద్ధరించబోమని ఇటీవలి ట్విట్టర్ వెల్లడించింది.

“ఇకపై మేము తీవ్రమైన చర్యలు తీసుకోము. పాలసీని ఉల్లంఘించే ట్వీట్‌ల రీచ్ తగ్గిస్తాం.. అలాంటి ట్వీట్‌లను తీసివేయమని యూజర్స్ కు సూచిస్తాం. ఇలా సూచించినా పునరావృతమయ్యే ఉల్లంఘనల కోసం ఖాతా సస్పెన్షన్ అనేది విధిస్తాం” అని ట్విట్టర్ తెలిపింది.ఈక్రమంలోనే గత నవంబర్‌లో మస్క్ నిర్వహించిన పోల్ ఆధారంగా ప్లాట్‌ఫారమ్ డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించింది.అక్టోబరులో మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న సమయంలో, సెమిటిక్ వ్యాఖ్యలు చేసినందుకు బ్యాన్ అయిన  రాపర్ కాన్యే వెస్ట్ ఖాతాను కూడా పునరుద్ధరించారు.

తన విమానం గురించి కథనాలు రాసినందుకు  గత డిసెంబర్‌లో ట్విట్టర్ యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రముఖ జర్నలిస్టుల ఖాతాలను నిషేధించింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత.. మస్క్ జర్నలిస్టుల ఖాతాలను పునరుద్ధరించాలా అని ట్విట్టర్ లో పోల్‌ను నిర్వహించాడు. ఈ పోల్‌లో దాదాపు 59 శాతం మంది వినియోగదారులు అలా చేయడానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆ అకౌంట్స్ పునరుద్ధరణ చేశారు.గత అక్టోబర్‌లో ఎలోన్ మస్క్ టేకోవర్ చేసినప్పటి నుంచి ఖాతా సస్పెన్షన్‌లు, పునరుద్ధరణల పరంగా ట్విట్టర్ టాప్సీ-టర్వీ రైడ్‌ను కలిగి ఉంది.