WhatsApp lock: వాట్సాప్ లాక్ ఇకపై మరింత ఈజీ.. థర్డ్ పార్టీ యాప్స్ కి బై చెప్పండి?

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదా

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 06:21 PM IST

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. అలాగే వాట్సాప్ వినియోగదారుల వినియోగదారుల భద్రత కోసం ఇప్పటికే పలు రకాల ఫీచర్లను తీసుకురాగా తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. మన వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లడం చాలా ప్రమాదకరం. అందుకే మన స్మార్ట్ ఫోన్ ను ఓపెన్ చేయడానికి పిన్ నంబర్, లేదా ఫేస్ లాక్ వంటి వాటిని పెట్టుకుంటాం. కానీ ఫోన్లోని వాట్సాప్ కు ఎలాంటి సెక్యూరిటీ ఉండదు.

ఎవరికైనా మన ఫోన్ లాక్ నంబర్ తెలిస్తే ఫోన్ ఓపెన్ చేసి, మన వాట్సాప్ ను కూడా పరిశీలించే అవకాశం ఉంది. దాని ద్వారా తప్పుగా చాటింగ్ చేసే ప్రమాదమూ పొంచి ఉంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. అయితే వాట్సాప్ యాప్ ను లాక్ చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మన సమాచారానికి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది. ఫోన్ ను ఓపెన్ చేసేటప్పుడు స్క్రీన్ లాక్ తీసినట్టుగానే దీనికీ సెట్ చేసుకోవచ్చు. వాట్సాప్ ను తెరవడానికి బయోమెట్రిక్ లేదా ఫేస్ లాక్ పెట్టుకోవచ్చు. వాట్సాప్ ను లాక్ చేసుకున్నా ఫోన్ లో కాల్స్ మాట్లాడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన పిల్లలకు ఫోన్ పిన్ నంబర్లు చెబుతాం.

అత్యవసర సమయంలో వారు ఫోన్ ను ఉపయోగించుకోవడానికి వీలు ఉంటుంది. ఇది మంచి పద్ధతే అయినప్పటికీ వారు వాట్సాప్ ను ఓపెన్ చేసి లేనిపోని చాటింగ్ లు చేసే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నింటికీ వాట్సాప్ లాక్ తో పరిష్కారం లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు అందరూ వాట్సాప్ ను లాక్ చేసుకోవడానికి, ఓపెన్ చేయడానికి వేలిముద్ర, ఫేస్ లాక్ ను ఉపయోగించవచ్చు. ఐఫోన్ వినియోగదారులు మాత్రం హ్యాండ్‌సెట్ లోని బిల్ట్ ఇన్ లాక్ ఫీచర్‌ ను వాడుకోవాలి. ముందుగా వాట్సాప్ సెట్టింగ్ లో వెళ్లి, కిందికి స్క్రోల్ చేసి, ఫింగర్ ప్రింట్ లాక్‌ను నొక్కాలి. మీ వేలిముద్రతో లాక్‌ ఆన్ చేయాలి. దీనిని నిర్ధారించడానికి వేలిముద్ర సెన్సార్‌ ను లేదా మీ ముఖాన్ని స్కాన్ చేయాలి. ఇక స్క్రీన్ లాక్ ఎలా ఆఫ్ చేయాలి అన్న విషయానికి వస్తే.. ఇందుకోసం ముందుగా వాట్సాప్ సెట్టింగ్ లోని వెళ్ళాలి. బటన్, ట్యాబ్ వేలిముద్ర లాక్‌ను క్లిక్ చేయాలి. వేలిముద్రతో అన్‌లాక్‌ను ఆఫ్ చేయాలి.