Mobile Radiation:మీ మొబైల్ రేడియేషన్ ఎంతో తెలుసా..?దీని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలివే..!!

స్మార్ట్ ఫోన్లు...ప్రజల జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. ఆహారం లేకుండా ఉంటారేమో కానీ సెల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి. బ్యాటరీ అయిపోయినా...డేటా అయిపోయినా...తెగ కంగారు పడిపోతారు.

  • Written By:
  • Updated On - June 9, 2022 / 05:12 PM IST

స్మార్ట్ ఫోన్లు…ప్రజల జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. ఆహారం లేకుండా ఉంటారేమో కానీ సెల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి. బ్యాటరీ అయిపోయినా…డేటా అయిపోయినా…తెగ కంగారు పడిపోతారు. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల వచ్చే లాభాలే కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్లలో గేమింగ్ వ్యసనం అనేది చాలా పెరిగింది. ఇదిఎంత ప్రాణాంతకమో కూడా నిరూపితమైంది. ఇవన్నీ కాకుండా ఎవరూ పట్టించుకుని ఇంకో విషయం ఏంటంటే మొబైల్ టవర్ల రేడియేషన్. మొబైల్ రేడియేషన్ తోపాటు టవర్ రేడియేషన్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

టవర్ రేడియేషన్ అంటే ఏమిటి..?
ఒక డివైజ్ ఒకదానికొకటి కనెక్ట్ కావాలంటే నెట్ వర్క్ చాలా అవసరం. మొబైల్ ఫోన్ల విషయంలో కూడా అంతే. మొబైల్ ఫోన్ల నెట్ వర్క్ కోసం టెలికాం కంపెనీలు పలు ప్రాంతాల్లో అవసరాన్ని బట్ట టవర్లను ఏర్పాటు చేస్తుంటాయి. నెట్ వర్క్స్ విషయంలో రేడయేషన్ అనేది రెండు రకాలు.
1. టవర్ నుంచి వెలువడేది
2. మొబైల్ నుంచి వెలువడేది.
మీరు టవర్ రేడియేషన్ న చెక్ చేసే ఛాన్స్ లేదు. కానీ మీ ఫోన్ చెక్ చేస్తుంది. టవర్ రేడియేషన్ మనతో ప్రత్యక్షంగా ఉండకపోయినప్పటికీ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ మొబైల్ ఫోన్ 24గంటల మనతో ఉంటే దాని ప్రభావం రెండింతలు ఉంటుంది.

సాధారణంగా మనం ఉపయోగించే మొబైల్ ఫోన్స్ ప్రత్యేకమైన తరంగాలను రిలీజ్ చేస్తాయిన. ఇవి సాధారణ జీవితానికి హానికరంగా పరిగణించబడతాయి. మొబైల్ రేడియేషన్ తో మానసిక కుంగుబాగుతోపాటు ఎన్నో ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు మీ మొబైల్ ఫోన్ రేడియేషన్ చెక్ చేయాలనుకుంటే….మీ మొబైల్ నుంచి *#07#డయల్ చేయాలి. ఈ నెంబర్ ను డయల్ చేసిన తర్వాత మొబైల్ స్క్రీన్ పై రేడియేషన్ కు సంబంధించిన సమాచారం వస్తుంది. ఇందులో రేడియేషన్ స్థాయిని రెండు రకాలుగా చూపిస్తుంది. ఒకటి హెడ్..ఇంకోటి బాడీ.

ప్రతికూలతలు…
మొబైల్ రేడియేషన్ బ్రెయిన్ క్యాన్సర్, కంటి సమస్యలు, ఒత్తిడి, న్యూరోడెజెనరేటివ్ సమస్యలు, హార్ట్ ఎటాక్, సంతానోత్పత్తి, వినికిడి వంటి సమస్యలకు కారణం అవుతుంది. ఎయిమ్స్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)చేసిన ఒక అధ్యయనంలో మొబైల్ రేడియేషన్ అనేది…ఒక వ్యక్తి చెవిటి ఇంకా నపుంసకత్వానికి కూడా కారణం అవుతుందని పేర్కొంది.

మొబైల్ రేడియేషన్ ఎంత ఉండాలి…?
SAR ప్రకారం ఏదైనా స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ఇతర స్మార్ట్ డివైజ్ రేడియేషన్ కిలో గ్రాముకు 1.6వాట్స్ కు మించి ఉండకూడదు. ఈ నియమం శరీరం నుంచి డివైజ్ 10ఎంఎం దూరానికి కూడా వర్తిస్తుంది. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లేదా మీ జేబులో పెట్టుకుని డివజై ఈ రేడియేషన్ పరిమితి మించి ఉన్నట్లయితే…అది మీ ఆరోగ్యానికి ప్రమాదకరంగా గుర్తించాలి. ఫోన్ ఎస్సెన్స్ వ్యాల్యూ కిలోకు 1.6వాట్స్ మించి ఉటే వెంటనే మీ ఫోన్ను మార్చేయాల్సిందే.

నివారణ మార్గాలు..?
టెక్నాలజి నిపుణుల ప్రకారం…ఏదైనా డివైజ్ పూర్తిగా రేడియేషన్ నుంచి విముక్తి పొందదు. కొంతమేర నివారించవచ్చు. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మాట్లాడవద్దు. ఈ సమయంలో మొబైల్ రేడియేషన్ 10 రెట్లు పెరుగుతుంది. సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు లేదా బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు కాల్ చేయకూడదు. ఈ సమయంలో రేడియేషన్ స్థాయి పెరుగుతుంది. హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తే…శరీరంపై రేడియేషన్ ప్రభావం కొంత మేర తగ్గుతుంది.