Jio Air fibre: జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏమిటి? ఇదేలా పని చేస్తుంది?

తాజాగా జియో బ్రాడ్ బ్యాండ్ విషయంలో మరొక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. అయితే జియో సంస్థ

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 01:00 PM IST

తాజాగా జియో బ్రాడ్ బ్యాండ్ విషయంలో మరొక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. అయితే జియో సంస్థ సేవలను మరింత విస్తరించేందుకు కొత్తగా ఎయిర్ ఫైబర్ ను తీసుకొస్తున్నట్లుగా ప్రకటించింది. తాజాగా రిలయన్స్‌ 45వ ఏజీఎంలో దీని గురించి ప్రకటన చేసింది. కాగా ఈ ఎయిర్ ఫైబర్ అంటే ఏమిటి?ఇది ఎలా పనిచేస్తుంది? అన్న విషయానికి వస్తే..దేశంలోని జియో ఫైబర్‌ సేవలు 2019లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ప్రధాన నగరాలలో అలాగే పట్టణాలలో ఈ సేవలను వినియోగించుకుంటూనే ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా 11 లక్షల కి.మీ. మేర ఈ ఫైబర్‌ నెట్‌వర్క్‌ నిర్మించినట్లుగా జియో సంస్థ అధినేత అయిన ముకేశ్‌ అంబానీ వెల్లడించారు.

కాగా ఇప్పటికే ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్స్‌ వేయని చోట జియో ఫైబర్‌ సేవలు అందడం లేదు కాబట్టి కొత్తగా ఈ కేబుల్స్‌ తో సంబంధం లేని ఎయిర్‌ ఫైబర్‌ సేవలను ప్రారంభించబోతున్నట్లు జియో సంస్థ ప్రకటించింది. ఇకపోతే ఇవి ఎలా పనిచేస్తాయి అన్న విషయానికి వస్తే.. మాములుగా ఈ బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలు ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్‌ ద్వారా వీటిని అందిస్తుంటారు. అయితే సేవలను పొందాలి అంటే వైర్‌తో పాటుగా, మోడెమ్‌ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జియో గిగా ఫైబర్‌ ఈ తరహాలోనే పనిచేస్తోంది. జియో ఎయిర్‌ ఫైబర్‌ కీ కేబుల్స్‌తో పనిలేదు.

ఇది ఒక సింగిల్‌ డివైజ్‌. ఇది దగ్గర లోని జియో టవర్స్‌ నుంచి వీటికి సిగ్నల్స్‌ అందుతాయి. దీని ద్వారా సాధారణ బ్రాడ్‌బ్యాండ్‌ తరహాలోనే వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఆనందించొచ్చని జియో చెబుతోంది. అయితే దీనిని ఫలానా ప్రాంతంలో అని మాత్రమే కాకుండా ఇంట్లో ఆఫీసుల్లో, వ్యాపారం చేసే ప్రదేశాలలో ఎక్కడైనా కూడా వినియోగించుకోవచ్చు.