ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. కాగా వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది వాట్సాప్ సంస్థ. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అనేక ఫీచర్లను పరిచయం చేస్తోంది. తద్వారా యూజర్లు మరింత సౌకర్యం, సౌలభ్యం పొందేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా వాట్సాప్ సంస్థ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయడానికి సిద్ధమయ్యింది.
డ్రాఫ్ట్ మెసేజ్ అని పిలిచే ఈ ఫీచర్ తో చాట్ లిస్ట్ లోని అసంపూర్తిగా ఉన్న మెసేజ్ లను నేరుగా గుర్తించవచ్చట. ఈ కొత్త ఫీచర్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఆండ్రాయిడ్ బీటా టెస్టర్ల కోసం మెసేజ్ డ్రాఫ్ట్ ఫీచర్‌ను పరిచయం కానుంది. చాట్ లిస్ట్ లోని అసంపూర్తిగా ఉన్న మెసేజ్ లను దీని ద్వారా సులవుగా గుర్తించవచ్చట. దాని ద్వారా వినియోగదారుడికి మెసేజ్ ల నిర్వహణ సులభం అవుతుంది. పంపని సందేశాలను కొత్త డ్రాఫ్ట్ లెబెల్ హైలైట్ చేస్తుంది. ప్రతి మెసేజ్ ను తెరవకుండానే వాటిని గుర్తించడం చాలా సులభంగా ఉంటుంది. తద్వారా ముఖ్యమైన కమ్యూనికేషన్లను కోల్పోయే ప్రమాదం కూడా ఉండదట. ప్రస్తుతం కొంత మంది బీటా టెస్టర్లకు కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. చాట్ లను త్వరగా గుర్తించడంలో సహాయపడే ఈ ఫీచర్ అసంపూర్తి సందేశాలు, పంపని సందేశాలను నేరుగా చాట్ లిస్ట్‌లో హైలైట్ చేస్తుంది.
వాటిని ఒక్క చూపులో గుర్తించడం చాలా సులభం అవుతుంది. వాటిని వెంటనే మళ్లీ రీసెండ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో మెసేజ్ అసంపూర్తిగా మిగిలిపోయిందో లేదో చెప్పడానికి స్పష్టమైన మార్గం ఉండేది కాదు. ప్రతి సంభాషణను మాన్యువల్ గా తనిఖీ చేయాల్సి వచ్చేది. కొత్త డ్రాఫ్ట్ లేబుల్ తో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రతి సంభాషణను తెరవాల్సిన అవసరం లేకుండానే పంపని సందేశాలను గుర్తించవచ్చట. ముఖ్యమైన సందేశాలు మన ఆత్మీయులు, స్నేహితులకు పంపడానికి ఈ ఫీచర్ మనకు సహాయ పడుతుంది. పంపని సందేశాలను మరచిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ చాట్లు యూజర్ల డ్రాఫ్ట్ కార్యాచరణ ఆధారంగా సంభాషణల జాబితాలో పైకిస్థానంలో ఉంటాయి. వాట్సాప్ తన వినియోగదారుల మెసేజింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. కొత్త ఫీచర్ తో యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు.