Site icon HashtagU Telugu

Digital Rupee: డిజిటల్ రూపీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Digital Rupee

Digital Rupee

దేశం డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే డిజిటల్ పేమెంట్లు భారీగా పెరగగా.. ఇదే కోవలో ఆర్బీఐ మరో అడుగు ముందుకు వేస్తూ ఈ-రూపీ (e-Rupee)ని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే పైలెట్ లాంఛ్ ఉండబోతున్నట్లు తెలుస్తుండగా.. డిజిటల్ రూపీకి సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఈ-రూపీ (డిజిటల్ రూపీ) అంటే ఏంటి?
ఆర్బీఐ ద్వారా జారీ చేయబడే ఇండియన్ రూపాయి యొక్క డిజిటల్ రూపమే ఈ-రూపీ లేదంటే డిజిటల్ రూపీ. ఆర్బీఐ దీనిని రెండు వర్షన్స్ లో విడుదల చేయాలని భావిస్తోంది. ఇంటర్ బ్యాంక్ సెటిల్మెంట్, పబ్లిక్ కోసం రిటైల్ రూపంలో.

ఈ-రూపీ క్రిప్టో కరెన్సీనా?
ఇది క్రిప్టో కరెన్సీ లాగా ప్రైవేట్ ది కాదు. ఇది పూర్తిగా ఆర్బీఐ ద్వారా జారీ చేయబడే మరియు నియంత్రించబడే డిజిటల్ రూపీ.

దీనిని ఎవరు తయారు చేస్తారు?
దీనిని ఆర్బీఐ తప్ప వేరే ఎవరూ తయారు చేయలేరు.

దీనిని ఎవరు జారీ చేస్తారు?
ఆర్బీఐ మాత్రమే దీనిని జారీ చేస్తుంది. కాకపోతే ప్రైవేట్ బ్యాంకులు దీనిని పంపిణీ చేస్తాయి.

ఈ-రూపీని ఎలా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు?
రిటైల్ వర్షన్ డిజిటల్ రూపీ టోకెన్ ఆధారంగా ఉంటుంది. దీనిని ప్రైవేట్ కీ ద్వారా ఎవరికైనా పంపిణీ చేయవచ్చు.

ఈ-రూపీ మీద వడ్డీ వస్తుందా?
లేదు, ఈ-రూపీ లేదంటే డిజిటల్ రూపీ మీద ఎలాంటి వడ్డీ రాదు.

Exit mobile version