Site icon HashtagU Telugu

PAN, Aadhaar: ఒక వ్యక్తి మరణం తర్వాత అతని ఆధార్, పాన్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ ఏమవుతాయో తెలుసా?

Pan, Aadhaar

Pan, Aadhaar

ఆధార్ కార్డు,పాన్ కార్డ్,అలాగే ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ముఖ్యమైన పత్రాలు అని చెప్పవచ్చు. ప్రభుత్వ అలాగే ప్రైవేటు పథకాల నుంచి బ్యాంకు అకౌంట్ అలాగే చిన్నా చితక పనుల వరకు ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ఆధార్ కార్డ్ అన్నది 12 అంకెల ప్రత్యేక సంఖ్య. ఈ ఆధార్ కార్డులో పేరు చిరునామా వేలిముద్రలు ఇలాంటి ఎన్నో రకాల విషయాలు నమోదు అయి ఉంటాయి. ఇక ఆధార్ కార్డు పాన్ కార్డు లేకపోతే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను చాలా వరకు పొందలేరు. చాలా వాటికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇంత ముఖ్యమైన డాక్యుమెంట్లు ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏమవుతాయి అన్న విషయాల గురించి చాలామందికి తెలియదు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముందుగా ఆధార్ కార్డు విషయానికొస్తే.. ఇది తరచుగా ఎల్‌పీజీ సబ్సిడీలు, స్కాలర్‌ షిప్‌లు, ఈపీఎఫ్‌ ఖాతాల వంటి క్లిష్టమైన సేవలకు లింక్ అవుతుంది. మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును నిష్క్రియం చేయడానికి లేదా రద్దు చేయడానికి ఎటువంటి ఆప్షన్‌ లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర మరణాల నమోదులతో దాని వ్యవస్థను ఏకీకృతం చేయలేదు. అలాగే మరణాలను నమోదు చేయడానికి ఆధార్ తప్పనిసరి కాదు. ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఎలా నిరోధించాలి అన్న విషయానికొస్తే..

చట్టపరమైన వారసులు మరణించిన వారి ఆధార్ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. ఆధార్‌కు సంబంధించిన బయోమెట్రిక్ డేటాను భద్రపరచడానికి, వారసులు UIDAI వెబ్‌సైట్ ద్వారా బయోమెట్రిక్‌ లను లాక్ చేయవచ్చు. ఇక పాన్ కార్డు విషయానికి వస్తే..ఆదాయపు పన్ను రిటర్న్స్ బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలను నిర్వహించడానికి, ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయడానికి పాన్‌ కార్డ్ అవసరం. ఐటీఆర్‌ లను ఫైల్ చేయడం, ఖాతాలను మూసివేయడం లేదా రీఫండ్‌ లను క్లెయిమ్ చేయడం వంటి అన్ని ఆర్థిక విషయాలు పరిష్కరించే వరకు పాన్ మీ వద్ద ఉండాలి.

ఈ పాన్ కార్డును ఎలా సరెండర్ చేయాలి అన్న విషయానికి వస్తే.. పాన్ ఎవరి అధికార పరిధిలో నమోదు చేయబడిందో అసెస్సింగ్ ఆఫీసర్ కి ఒక దరఖాస్తును రాయాలి. మరణించిన వ్యక్తి పేరు, పాన్, పుట్టిన తేదీ, మరణ ధృవీకరణ పత్రం కాపీని చేర్చి, పాన్‌ను సరెండర్ చేయడం తప్పనిసరి కాదు. అయితే అన్ని ఆర్థిక విషయాలు పరిష్కరించిన తర్వాత చేయవచ్చు. ఇకపోతే ఓటర్ల నమోదు నిబంధనలు 1960 ప్రకారం మరణించిన వ్యక్తి ఓటరు గుర్తింపు కార్డును రద్దు చేయవచ్చు. దీని కోసం స్థానిక ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించాలి.

మరణ ధృవీకరణ పత్రం కాపీతో పాటు ఎన్నికల నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న ఫారమ్ 7ను సమర్పించాలి. ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితా నుండి పేరు తొలగిపోతుంది. పాస్‌పోర్ట్ హోల్డర్ మరణించిన తర్వాత సరెండర్ లేదా రద్దు అవసరం లేదు. అయితే దాని గడువు ముగిసిన తర్వాత చెల్లుబాటు కాదు. వెరిఫికేషన్ వంటి ప్రయోజనాల కోసం ఇది ఉపయోగకరమైన పత్రంగా ఉపయోగపడుతుంది. అందుకే గడువు ముగిసినా పాస్‌పోర్ట్‌ ను అలాగే ఉంచుకోవాలి.

Exit mobile version