Car Smoke: కారు నుంచి ఈ రంగులో పొగ వస్తోందా.. అయితే వెంటనే ఇలా చేయండి?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో రోజురోజుకీ వాహన వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. దీంతో

  • Written By:
  • Publish Date - January 13, 2023 / 07:00 AM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో రోజురోజుకీ వాహన వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. దీంతో ప్రతి 10 మందిలో ఆరు మంది వద్ద కార్లు బైకులు ఉంటున్నాయి. ఇదివరకు రోజుల్లో కారు కొనాలంటే చాలామంది అన్ని లక్షలు ఎలా అని ఆలోచించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం కారు అన్నది చాలామందికి సాధారణ వెహికల్ గా మారిపోయింది. కుటుంబంతో కలిసి బయటికి వెళ్లాలన్నా ఎక్కడైనా లాంగ్ టూర్ వెళ్ళాలి అనుకున్నా కూడా అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అని కార్ ని కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్ అయితే కొనుగోలు చేస్తున్నారు కానీ చాలామంది ఉరుకుల పరుగుల జీవితం కారణంగా కారు సర్వీస్ చేయించడం లేదంటే కారు శుభ్రం చేయడం లాంటివి చేయరు.

ఇది కారుకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోకుండా ఒకేసారి నీ పేరు చేయించుకున్నప్పుడు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. చాలామంది బయటకు వెళ్ళినప్పుడు కారులో నుంచి పొగలు రావడం అన్న ప్రధాన సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కారు పొగలు కూడా ఒక్కొక్కసారి వివిధ రంగులలో వస్తుంటాయి. మరి ఆ రంగును బట్టి దానికి కారణాన్ని తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కారులో నుంచి కొన్ని కొన్ని సార్లు నల్ల పొగ వస్తుంటుంది. దానికి గల కారణం ప్యూయెల్ లీక్ అవుతుందని అర్థం. గాలి ఫ్యూయెల్ నిష్పత్తిలో సమస్య కలిగినప్పుడు ఇలా నల్ల పొగ వస్తుంది.

అలాగే అరిగిపోయిన నాజిల్ కారణంగా ఫ్యూయెల్ ఇంజెక్టర్ లీకేజీ జరిగి నల్లని రంగు పొగ వస్తుంది. కొన్ని కొన్ని సార్లు నీలి రంగు పొగ కూడా వస్తూ ఉంటుంది. ఇలా పొగ నీలి రంగులో వస్తే ఇంజిన్‌లో లోపం ఉందని అర్థం. పిస్టన్ లేదా వాల్వ్ గైడ్ సీల్ దెబ్బతిన్న తర్వాత ఇటువంటి బ్లూ కలర్ పొగ బయటకు వస్తుంది. అప్పుడు వీలైనంత తొందరగా మెకానిక్ ని సంప్రదించడం మంచిది. కారు నుంచి తెల్లటి పొగ వస్తుంది అంటే కూలంట్‌ లీక్ అయినప్పుడు ఈ రకమైన పొగ వస్తుంది. కూలంట్‌ పని వాహనం ఇంజిన్ చల్లగా ఉంచడం. ఇది లీక్ అయితే కారు త్వరగా వేడెక్కడమే కాక ఇంజిన్ వెంటనే చెడిపోతుంది.