Site icon HashtagU Telugu

Second Hand Bike: సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Second Hand Bike

Second Hand Bike

చాలామందికి సొంత వాహనం కొనుగోలు చేయడం అన్నది ఒక కల. ముఖ్యంగా యువత సొంతంగా ఒక బైక్ ఉండాలని ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. కొందరు అప్పులు చేసి అయినా సరే సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేస్తే, ఇంకొంతమంది సెకండ్ హ్యాండిల్ బైకులను కొనుగోలు చేసి ఆ ఆశలను నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేయడం మంచిదే కానీ, బైకు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని రకాల విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది పాత బైక్ లను కొనుగోలు చేసిన తర్వాత చెడిపోయిందని చెప్తుంటారు. అందుకే సాధారణంగా బైక్ కొనడానికి ముందు వాటిని బాగా పరిశీలించి దాని కండిషన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని చెబుతుం టారు. మీరు కొనే బైక్ ఇంజిన్, గేర్లు, బ్రేకులు, టైర్లు, ఇతర భాగాలన్నింటినీ జాగ్రత్తగా చెక్ చేయాలి. అలాగే బైక్ ను ఖచ్చితంగా నడపాలి. అది ఎలా నడుస్తుందో తెలుసుకోవాలి.

ముఖ్యంగా బైక్ ను మంచి మెకానిక్ తో చెక్ చేయించాలి. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ బైక్ ను కొనేముందు దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పేపర్స్, బైక్ రిజిస్ట్రేషన్ పేపర్ (ఆర్సీ), ఇతర డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అన్ని పేపర్లు చెల్లుబాటు అవుతాయో, లేదో కూడా చూసుకోవాలి. అయితే చాలా మంది కారును కొనేముందు అన్ని సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. అలాగే బైక్ ను కొనేముందు కూడా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. పీడీఐ అంటే ప్రీ-డెలివరీ ఇన్ స్పెక్షన్. మీరు కొనే బైక్ మంచి కండిషన్ లో ఉందని, అందులో ఎలాంటి లోపం లేదని నిర్ణయించుకునే ముఖ్యమైన ప్రక్రియ ఇది. బైక్ కంపెనీ స్వయంగా అనేక పారా మీటర్లపై చెక్ మార్క్ లను పెడుతుంది. పీడీఐ సాధారణంగా కొత్త బైక్ కొనేటప్పుడు కంపెనీ చేస్తుంది.

కానీ పాత బైక్ కొనేటప్పుడు మీరే చేయాలి. బైక్ కు ఛాసిస్ నంబర్ ప్రత్యేకమైన గుర్తింపు. ఇది 17 అంకెల సంఖ్య. అంటే ఇది తయారీ దారు, మోడల్, సంవత్సరం, వీఐఎన్ వంటి బైక్ గురించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. అందుకే మీరు పాత బైక్ ను కొనేటప్పుడు ఛాసిస్ నంబర్ లేదా ఫ్రేమ్ నంబర్ ను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. బైక్ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ కార్డుపై రాసిన ఛాసిస్ నంబర్ మీకు కనిపిస్తుంది. ఇవన్నీ మీరు చెక్ చేసుకుని బైక్ ను కొనడమే మేలు. లేదంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనేటప్పుడు పైన చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకోవడం మంచిది.