WhatsApp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్…క్షణాల్లోనే..!!

స్మార్ట్ ఫోన్ వాడే వారందరికీ వాట్సాప్ తెలిసిఉంటుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే...అందులో వాట్సాప్ ఉండాల్సిందే.

  • Written By:
  • Publish Date - May 14, 2022 / 06:00 AM IST

స్మార్ట్ ఫోన్ వాడే వారందరికీ వాట్సాప్ తెలిసిఉంటుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే…అందులో వాట్సాప్ ఉండాల్సిందే. వీడియోలు, ఫైల్స్, లింక్స్, ఫొటోలు, వాయిస్ కాల్స్, వీడియోకాల్స్…ఇలా ఎన్నోఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో వాట్సాప్ ఎంతో మందికి చేరువైంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా…ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది వాట్సాప్. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు పలు మార్గాలను పరీక్షిస్తోంది. మెసేజింగ్ యాప్ చాట్ ఫిల్టర్లలో పనిచేస్తున్నట్లు కనుగొన్నది. ఇది వినియోగదారులను సులభంగా, వేగంగా చాట్ లను కనుగొనేలా చేయనుండటంతో…చాట్ ఫిల్టర్ అనే కొత్త ఫీచర్ ను తీసుకొస్తుంది.

కాగా చాట్ ఫిల్టర్ ఫీచర్ ఇప్పటికే వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు వ్యాపారేతర ఖాతాకు కూడా పరిచయం చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మధ్యే వాట్సాప్ 2జీబీ వరకు ఫైల్స్ ను బదిలీ చేసే సామర్యం ఏమోజీ ప్రతిచర్యలతోపాటు మరికొన్ని ఆసక్తికరమైన మార్పులు తీసుకోస్తుంది. ఇప్పుడు తాజాగా వాట్సాప్ ఆన్ రైడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ కోసం వ్యాపార ఖాతాల కోసం అధునాతన చాట్ ఫిల్టర్లను రూపొందించింది. చాట్ లను త్వరగా వెతకడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. త్వరలోనే వినియోగదారులందరికీ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి.

వాట్సాప్ లో చదవలేని చాట్స్, కాంటాక్ట్ లు,నాన్ కాంటాక్ట్ లు, గ్రూపుల కోసం సెర్చ్ చేయడానికి సులభం కానుంది. చాట్ ఫిల్టర్ ప్రైమరీ వాట్సాప్ అకౌంట్లలో కూడా యాప్ ఫీచర్ ఆప్ డేట్ తీసుకురాబోతోంది. ఈ ఫిల్టర్ బటర్ మీరు చాట్స్ మెసెజ్ ల కోసం సెర్చ్ చేసినప్పుడు కూడా కనిపిస్తుంది. చాట్ ఫిల్టర్ ఫీచర్ డెస్క్ టాప్ లో వాట్సాప్ బీటాలో కనిపించింది. రానున్న కాలంలో ఆండ్రాయిడ్ ఐఓఎస్ లోని బీటా టెస్టర్ ల కోసం వాట్సాప్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు వారాల క్రితమే వాట్సాప్ బీటా UWP 2.2216.4.0వెర్షన్ ను ఇన్ స్టాల్ చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.