WhatsApp Status : సీక్రెట్‌గా ఇతరుల వాట్సాప్ స్టేటస్ చూసేయండి..

WhatsApp Status : మన మనసులో నడుస్తున్న ‘స్టేటస్’ ఏమిటో అందరికీ చెప్పుకోవడానికి.. ఇప్పుడు ‘వాట్సాప్ స్టేటస్’‌ను పెట్టుకోవడం కామన్‌గా మారిపోయింది!!

  • Written By:
  • Publish Date - November 18, 2023 / 06:20 AM IST

WhatsApp Status : మన మనసులో నడుస్తున్న ‘స్టేటస్’ ఏమిటో అందరికీ చెప్పుకోవడానికి.. ఇప్పుడు ‘వాట్సాప్ స్టేటస్’‌ను పెట్టుకోవడం కామన్‌గా మారిపోయింది!! అయితే వాట్సాప్ స్టేటస్‌ను ఎదుటి వ్యక్తులకు తెలియకుండా.. ఎలా చూడాలి ? అసలు అలా చూడొచ్చా ? అనే డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. ఔను.. ఆ ఛాన్స్ ఉంది. ఇతరులకు తెలియకుండానే వాళ్ల స్టేటస్‌ను సీక్రెట్‌గా చూసేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join.

సీక్రెట్స్ ఇవీ.. 

  • సీక్రెట్‌గా ఇతరుల వాట్సాప్ స్టేటస్‌ను చూసేందుకు మీరు.. మీ ఫోన్‌లో ‘ఎయిర్​ప్లేన్ మోడ్’‌ను ఆన్ చేయాలి. మొబైల్ డేటా, వైఫై డేటా ఆఫ్ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి సేవ్ అయి ఉన్న వాట్సాప్​ స్టేటస్​లను చూడొచ్చు. ఈవిధంగా స్టేటస్‌ను చూస్తే.. మీ పేరు దాన్ని  చూసిన వారి కౌంట్‌లో చేరదు.
  • వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి .. ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అందులో Read Receipts అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని డిజేబుల్ చేయండి. ఇక మీరు ఇతరుల మెసేజ్ చదివినా, స్టేటస్ చూసినా .. వారికి ఆ విషయం తెలియదు.
  • వాట్సాప్​ స్టేటస్​లను సీక్రెట్‌గా చూసేందుకు థర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని వాడకపోవడమే బెటర్. వీటి వల్ల రిస్క్ కూడా ఎక్కువే. మీ వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే డేంజర్ ఉంటుంది.
  • మీ వాట్సాప్ స్టేటస్​ను గుర్తుతెలియని వ్యక్తులు లేదా అన్​వాంటెడ్​ వ్యక్తులు చూడకూడదని భావిస్తే.. కాంటాక్ట్​ లిస్ట్ నుంచి ఆ నంబర్లను డిలీట్ చేయండి. లేదా ఆ నంబర్లను (WhatsApp Status) బ్లాక్ చేసేయండి.​ ఇక మీ పని పూర్తయినట్టే..!

Also Read: Jay Shah: జై షాకు అధికారికంగా క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం.. ఎందుకంటే..?