Instagram : ఇన్‌స్టాలో మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..

ఇంస్టాగ్రామ్ (Instagram) సంస్థ కూడా వినియోగదారులను ఆకర్షించడం కోసం మంచి మంచి ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 08:20 PM IST

Instagram simple Tricks : దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలలో ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) కూడా ఒకటి. అంతేకాకుండా రోజురోజుకీ ఈ ఇంస్టాగ్రామ్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇంస్టాగ్రామ్ (Instagram) సంస్థ కూడా వినియోగదారులను ఆకర్షించడం కోసం మంచి మంచి ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. అయితే మామూలుగా అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ (Instagram)లో మనం వేరే వాళ్ళని బ్లాక్ చేయడం లేదంటే వేరే వాళ్ళు మనల్ని బ్లాక్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మిమ్మల్ని ఇతరులు బ్లాక్ బ్లాక్ చేసి ఉంటే ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? అందుకోసం ఎటువంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరిదైనా ప్రొఫైల్‌ను కనుగొనలేకపోతే దానికి కారణం వారు మిమ్మల్ని బ్లాక్ చేసైనా ఉండాలి లేదంటే వారి ప్రొఫైల్ పేరును మార్చి అయిన ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులను వారి యూజర్ నేమ్ పేర్లను మార్చుకోవడానికి అనుమతిస్తుంది. కాబట్టి వారు కొత్త యూజర్ నేమ్ కలిగి ఉంటే మీరు వాటిని సెర్చ్ రిజల్ట్స్ లో చూడలేరు. పబ్లిక్ ప్రొఫైల్‌ లను సులభంగా సందర్శించవచ్చు. ఈ ఖాతా ప్రైవేట్ అని మీకు సందేశం వస్తే, మీరు బ్లాక్ చేయబడకపోవచ్చు. వారి ప్రొఫైల్‌ను చూడటానికి, ఫాలో బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతోంది. మీరు మీ అభ్యర్థనను ఆమోదించిన తర్వాత వారు ఏమి షేర్ చేస్తున్నారో మీరు చూడవచ్చు. అలాగే ఇంస్టాగ్రామ్ లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారు లేదో తెలుసుకోవడానికి మరొక టిప్ ఇతరుల ఖాతా నుంచి ఆ ఐడిని ఓపెన్ చేసి చూడడం. మరొక ఖాతా నుంచి సెర్చ్ చేసినప్పుడు ప్రొఫైల్ కనిపిస్తే, మీరు బ్లాక్ చేయబడవచ్చు. అయినప్పటికీ, మీరు ఇప్పటికీ వారిని కనుగొనలేకపోతే, వారు తమ వినియోగదారు పేరును మార్చుకుని ఉండవచ్చు.

లేదా వారి ప్రొఫైల్‌ను డీయాక్టివేట్ చేసి ఉండవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రతి వినియోగదారు వారి వినియోగదారు పేరును కలిగి ఉన్న ప్రత్యేకమైన ప్రొఫైల్ లింక్‌ను కలిగి ఉంటారు. ఒక వ్యక్తి ప్రొఫైల్ పేజీని సందర్శించడానికి, కేవలం instagram.com/username అని టైప్ చేస్తే చాలు నేరుగా వారి ఐడిని మనకు చూపిస్తుంది. అలా కాకుండా పేజీ అందుబాటులో లేదు అని చూపించినట్లయితే ఆ ఐడి ఉపయోగించడం లేదని అర్థం చేసుకోవాలి. మీరు బ్లాక్ చేయబడి ఉన్నారో లేదో తనిఖీ చేయడానికి, మీ ఖాతా నుంచి లాగ్ అవుట్ అయిన తర్వాత వేరే బ్రౌజర్‌ని ఉపయోగించి అదే లింక్‌ని ఓపెన్ చేయాలి. అప్పుడు కూడా మీకు అలాగే వస్తే వారు వారి ఖాతాను డీయిక్టివేట్ చేశారని అర్ధం. కానీ మీరు వారి ప్రొఫైల్‌ను చూసినట్లయితే, వారు మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం. అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే ట్యాగ్ చేయడానికి ఇన్ స్టాగ్రామ్ మిమ్మల్ని అనుమతించదు. మీరు బ్లాక్ చేయబడి ఉన్నారో లేదో తనిఖీ చేయడానికి, వారిని సందేశంలో పేర్కొనడానికి లేదా ట్యాగ్ చేయడానికి ప్రయత్నించాలి. ఆ ఐడి వాళ్ళు యూస్ లో ఉన్నప్పటికీ మీరు ఏ పోస్ట్‌లను చూడలేకపోతే, మీరు బ్లాక్ చేయబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

Also Read:  Wedding: నిశ్చితార్థం వేడుకలో ‘మటన్’ లొల్లి.. ఆగిపోయిన పెళ్లి!