Site icon HashtagU Telugu

Best 5G Phones : రూ.15వేలలోపు బడ్జెట్లో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..

Best 5g Phones1

Best 5g Phones1

Best 5G Phones : 5జీ యుగం ఇది. 5జీ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ల విప్లవానికి కొత్త రెక్కలు తొడిగింది. ఎయిర్‌టెల్, జియో సహా అన్ని టెలికాం కంపెనీలు 5జీ సేవలతో దూసుకుపోతున్నాయి. 5జీ నెట్‌వర్క్ ఇప్పటికే  మనదేశంలో చాలాచోట్లకు విస్తరించింది. ఈనేపథ్యంలో రూ.15వేలలోపు బడ్జెట్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ ఫీచర్స్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్ల వివరాలను తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ఐటెల్ పీ55 

ఐటెల్ కంపెనీ నుంచి ‘పీ55 5జీ’ (Itel P55 5G) మోడల్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. దీని ధర రూ.9,499. ఇందులో 4 జీబీ ర్యామ్‌తో పాటు 64 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఇక 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ కలిగిన ‘పీ55 5జీ’ కావాలంటే మాత్రం రూ.9,999 ధరకు వచ్చే మరో వేరియంట్‌ను తీసుకోవాలి. ఈ ఫోన్‌ను కొన్న తర్వాత మొదటి 100 రోజుల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ కూడా ఇస్తారు. రెండు సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఏఐ పవర్డ్ డ్యూయల్ కెమెరా సెటప్‌‌ ఈ ఫోన్ వెనక వైపు ఉంది. బ్లూ, గ్రీన్ కలర్‌లో ఇది లభిస్తోంది.

పోకో ఎం6 ప్రో  

పోకో కంపెనీ నుంచి ‘ఎం6 ప్రో 5జీ’ (Poco M6 Pro 5G) మోడల్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. దీని ధర రూ.10,999. ఇందులో 4 జీబీ ర్యామ్‌తో పాటు 64 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఒకవేళ 6 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ కావాలంటే రూ.11,999 ధరకు వచ్చే మరో వేరియంట్‌ను తీసుకోవాలి. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌. 6.79 అంగుళాల భారీ డిస్‌ప్లే ఉంటుంది. దీని వెనకవైపు రెండు కెమెరాలు ఉంటాయి. పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో పోకో ఎం6 ప్రో 5జీ లభిస్తుంది.

రియల్‌మీ నార్జో 60ఎక్స్ 

రియల్‌మీ కంపెనీ ‘నార్జో 60ఎక్స్’ (Realme Narzo 60x 5G) స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. దీనికి సంబంధించి రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.12,999. 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.14,499. నెబ్యులా పర్పుల్, స్టెల్లార్ గ్రీన్ కలర్‌లలో ఇది లభిస్తుంది. ఈ ఫోన్లలో ఆక్టాకోర్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను అందించారు.

వివో టీ2ఎక్స్ 

వివో టీ-సిరీస్‌లో వివో టీ2ఎక్స్ (Vivo T2x 5G) అనే స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. ఇందులో 8 జీబీ ర్యామ్‌తో కూడిన  128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999.  6 జీబీ ర్యామ్‌తో కూడిన 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. 4 జీబీ ర్యామ్‌తో కూడిన 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999. ఈ ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.  ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో ఇది నడుస్తుంది.  5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. మిర్రర్ బ్లాక్, ఫాగ్ బ్లూ రంగుల్లో ఇది లభిస్తుంది.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో ఒకే రోజు 22 అగ్ని ప్రమాదాలు, భారీగా నష్టం!