Car Offer: ఈ కారు పై లక్ష ఇరవై వేల రూపాయల తగ్గింపు…ఈ ఒక్క రోజే ఆఫర్

కొంత మంది కార్లు కొనడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో వస్తువుపై ఇష్టం ఉంటుంది. మార్కెట్లో కొత్త

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 08:30 PM IST

కొంత మంది కార్లు కొనడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో వస్తువుపై ఇష్టం ఉంటుంది. మార్కెట్లో కొత్త ఫీచర్లతో ఏది విడుదలైనా కొనేస్తూ ఉంటారు ఖర్చుకు మాత్రం అసలు వెనుకాడరు. ఇలా మొబైల్స్, బైక్స్, కార్స్ ఎప్పటికప్పుడు మార్చేస్తూ వస్తువులపై తమ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

మాములుగానే ఇలాంటి వాళ్ళు మార్కెట్లోకి కొత్తగా వస్తే కొనకుండా ఉండలేరు. అదే ఆఫర్లో వస్తే ఊరుకుంటారా. అప్పటికప్పుడు కొనేస్తారు. అయితే అదే మార్కెట్లోకి కొత్తగా భారీ డిస్కౌంట్ తో విడుదలైతే అసలు ఊరుకోరు. ఇప్పుడు వోక్స్ వ్యాగన్ కంపెనీకి చెందిన టైగున్ కారు లక్ష యాభై వేల డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ ఆఫర్ ఇవాళ ఒక్క రోజు మాత్రమే. వోక్స్ వ్యాగన్ కు చెందిన అన్ని కార్లకు ఈ ఆఫర్ వర్తించదు. కేవలం టైగున్ కార్లకే ఈ ఆఫర్ లభిస్తుంది.

ఇది ప్రధానంగా 1.0 లీటర్ త్రి సిలిండర్ పెట్రోల్ ఇంజన్,1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ పై యాభై వేలు, ఇన్సూరెన్స్ మార్జిన్ కింద ముప్పై వేలు, డీలర్ మార్జిన్ కింద ముప్పై వేలు తగ్గింపుని కంపెనీ అందిస్తోంది. 1.5 లీటర్ మ్యానువల్ వేరియంట్ పై 10 వేల రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది. వోక్స్ వ్యాగన్ తైగున్ 1.5 లీటర్ల షో రూమ్ ధర 15.97 లక్షలుగా ఉంది ఢిల్లీ అన్లోడ్ ధర 18.78 లక్షలు అవుతుంది.

ఇప్పుడు మనకు ఆఫర్ ప్రకారం చూసుకుంటే ఈ కారు 17.57 లక్షలకు లభిస్తుంది. అంతే కాకుండా ఈ కారుపై నాలుగేళ్ల సర్వీస్ ప్యాక్ అందిస్తుంది. కంపెనీ నుండి ఈ ప్యాక్ ని ఉంచితంగా పొందవచ్చు. అలాగే వోక్స్ వ్యాగన్ 1.0 మ్యానువల్ వేరియంట్ పై కంపెనీ స్కీం కింద 25 వేలు, డీలర్ మార్జిన్ లో 35 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ కింద 10 వేల తగ్గింపు లభిస్తుంది. ఈ కారు షోరూమ్ ధర 11.56 లక్షలు. ఢిల్లీ అన్లోడ్ తో 13.54 లక్షలు అవుతుంది. కానీ ఈ ఆఫర్ లో కేవలం 12.79 లక్షలకు ఈ కారు ని మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి, షో రూమ్ లను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి మీ దగ్గర్లోని షో రూంలో సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.