ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఎప్పటి కప్పుడు కొత్త కొత్త స్మార్ట్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అలాగే ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఇది ఇలా ఉంటే స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల వివో రిలీజ్ చేసిన వివో టీ 3 అల్ట్రా యూజర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసి ఉపయోగిస్తున్న వారు మంచి రివ్యూలను ఇస్తున్నారు.
కెమెరాతో పాటు ఫీచర్ల పరంగా ఈ ఫోన్ అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొన్ని ఫీచర్లు యూజర్లు సహనాన్ని పరీక్షిస్తాయని చెబుతున్నారు. వివో టీ3 అల్ట్రా ఫోన్ ఫీచర్లు వివో వీ 40తో సరిసమానంగా ఉన్నాయట. డైమెన్షన్ 9200+ చిప్‌సెట్ తో వచ్చే వివో టీ3 అల్ట్రా ధర రూ. 28,999 కాగా, వీ40 సిరీస్ ధర రూ. 34,999 గా ఉంది. కాబట్టి ధర పరంగా వివో టీ 3 అల్ట్రా మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వివో టీ3 అల్ట్రా మినిమలిస్టిక్ డిజైన్ తో ఆకట్టుకుంటుందని యూజర్స్ చెబుతున్నారు. ఈ ఫోన్ చూడగానే ఒక ప్రీమియం ఫోన్ చూసినంత అనుభూతి కలుగుతుందని వివరిస్తున్నారు.
ఫ్రాస్ట్ గ్రీన్ కలర్ వేరియంట్ అయితే వేరు లెవెల్ అని పేర్కొంటున్నారు. అయితే ఈ ఫోన్‌ను కచ్చితంగా కంపెనీ అందించే కేస్ ద్వారా వాడాలని లేకపోతే జారిపోయే ప్రమాదం ఉందని యూజర్లు చెబుతున్నారు. ఈ ఫోన్ ఐపీ 68 రేటింగ్‌తో వస్తుంది. 6.78 అంగుళాల కర్వ్‌డ్ ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లే గేమింగ్ ప్రియులతో పాటు ఎక్కువగా వీడియోలను స్ట్రీమింగ్ చేసే వారిని ఆకట్టుకుంటుంది. 4500 నిట్స్ బ్రైట్‌నెస్ అమితమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఆరా లైట్ ఫీచర్ మహిళలను అమితంగా ఆకర్షస్తుంది. ఈ ఫోన్‌లో వచ్చే సింగిల్ స్పీకర్ మంచి రేంజ్‌తో స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. వివో టీ3 అల్ట్రా ఫన్ టచ్ ఓఎస్ 14 ఆధారంగా పని చేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పని చేస్తుంది. తాజా అప్‌డేట్స్ ప్రకారం వివో రెండు సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్స్‌ను, మూడు సంవత్సరాల భద్రతా నవీకరణలను వాగ్దానం చేసింది. బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే వివో టీ 3 అల్ట్రా 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.