టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో 5 స్మార్ట్ ఫోన్ ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. మార్కెట్లో 5జి రెండు మొదలవడంతో చాలామంది eఈ మొబైల్ ను ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా అంతే వేగంగా 5జీ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. ఈ నేపథంలోనే వివో సంస్థ తాజాగా మరో 5జీ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకు రావడానికి సిద్ధంగా ఉంది. వివో భారతీయ మార్కెట్లోకి తన వై100 మోడల్ ను లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. దీంతో పాటుగా ఇంకా వై సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అందులో భాగంగానే వివో వై56 మోడల్ ను ఆవిష్కరించడానికి ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ ఫోన్ ని ఫిబ్రవరి 15 న భారతీయ మార్కెట్లోకీ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల విషయానికి వస్తే.. భారతీయ మార్కెట్లో వివో వై 56 5జీ ఫోన్ ధర రూ. 18,999గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీనిని ఫిబ్రవరి 15న లాంచ్ చేయనున్నారు. వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్, వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.58 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ మాలి జీ52 జీపీయూ ఉంటుంది.
ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే ఫన్ టచ్ ఓఎస్ ని కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. వివో వై56 5జీ ఫోన్ లో 50ఎంపీ ప్రైమరీ రియర్ షూటర్, 2ఎంపీ సెకండరీ కెమెరాతో అమర్చబడి ఉంటుంది. వీడియో కాల్‌లు, సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే ఈ ఫోన్ బ్యాటరీ 5000mAh సామర్థ్యంను కలిగి ఉండనుంది. .
