Vivo Y400 Pro: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన వై సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. వివో వై400 ప్రో (Vivo Y400 Pro) పేరుతో వస్తున్న ఈ మిడ్-రేంజ్ ఫోన్ నేటి నుంచే లభ్యం కానుంది. గత ఏడాది విడుదలైన వై300 ప్రోకు సక్సెసర్‌గా రాబోతున్న ఈ ఫోన్, అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోనుంది.
వివో వై400 ప్రో, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ 15 UIతో పనిచేస్తుంది. దీన్ని 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో డిజైన్ చేశారు, 120Hz రిఫ్రెష్ రేట్ , 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఇది ఓ విజువల్ ట్రీట్‌గా మారనుంది. ఫోన్ హార్ట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ పని చేస్తుంది, గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ఇది స్మూత్‌గా పని చేస్తుంది.
కెమెరా సెగ్మెంట్లో 50MP సోనీ IMX882 డ్యూయల్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ పరంగా 5500 ఎంఏహెచ్ కెపాసిటీతో, 90 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో దీర్ఘకాలిక పనితీరు అందిస్తుంది.
ఈ ఫోన్ ఫెస్టివల్ గోల్డ్, ఫ్రీ స్టైల్ వైట్, నెబులా పర్పుల్ వంటి మూడు రంగుల్లో లభ్యం కానుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు ₹25,000గా ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనితో వన్‌ప్లస్ నార్డ్ CE4, నథింగ్ ఫోన్ 3, మోటరోలా ఎడ్జ్ 60 వంటి ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ముఖ్యమైన స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 6.77″ AMOLED, 120Hz, 4500nits
ప్రాసెసర్: MediaTek Dimensity 7300
ర్యామ్ & స్టోరేజ్: 8GB RAM వరకు, 256GB వరకు స్టోరేజ్
కెమెరా: 50MP రియర్, 32MP ఫ్రంట్
బ్యాటరీ: 5500mAh, 90W ఫాస్ట్ ఛార్జింగ్
OS: Android 15 with Funtouch OS 15
ఇతర ఫీచర్లు: 5G సపోర్ట్, Optical Fingerprint, USB-C, IP65 రేటింగ్
Share Market : ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితేనే మార్కెట్లో మార్పు