Site icon HashtagU Telugu

Vivo Smart Phones: వివో నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. ధర ఫీచర్స్ ఇవే!

Vivo Smart Phones

Vivo Smart Phones

భారత మార్కెట్లో వివో స్మార్ట్ ఫోన్ లకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. వివో సంస్థ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త కొత్త మొబైల్ ఫోన్లు విడుదల అవుతాయా అని వినియోగదారులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. వీటిని కొనుగోలు చేయడానికి మొబైల్ ప్రియులు సైతం ఆసక్తిని చూపిస్తుంటారు. వినియోగదారుల డిమాండ్ మేరకు వివో సంస్థ కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పటికీ ఎన్నో రకాల ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వివో నుంచి ఇటీవలే వీవో వీ40 ప్రో, వీవో వీ40 ఫోన్ లు విడుదలైన విషయం తెలిసిందే. వీ 30 సిరీస్ ను అప్ గ్రేడ్ చేసి వీవో వీ40 ప్రో, వీవో వీ40 ఫోన్లను రూపొందించారు.

వీటిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వీవో వీ40 ప్రో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 9200 ప్లస్ చిప్ సైట్ పై ఆధారపడి పనిచేస్తుంది. అలాగే వీవో 40 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్ సెట్ ఏర్పాటు చేశారు. ఈ రెండు ఫోన్లలోని 5500 ఎమ్ఏహెచ్ బ్యాటరీలు 80 డబ్ల్యూ పాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తాయి. అలాగే జీస్ బ్రాండ్ కెమెరాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ల ధరల విషయానికి వస్తే.. 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.49,999 కాగా 12 జీబీ + 512 జీబీ వెర్షన్ ధర రూ. 55,999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు గంగెస్ బ్లూ, టైటానియం గ్రే వంటి రంగుల్లో లభించనుంది. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన విక్రయాలు ఆగస్టు 13 నుంచి మొదలు కానున్నాయి. వీవో వీ40 ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు.

8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ రూ.34,999కాగా అలాగే 8జీబీ + 256 జీబీ వెర్షన్ రూ.రూ. 36,999 గా ఉంది. చివరిగా 12 జీబీ + 512 జీబీ స్టోరేజ్ వెర్షన్‌ రూ.41,999 కీ లభించనుంది. ఈ ఫోన్ గంగెస్ బ్లూ, లోటస్ పర్పుల్, టైటానియం గ్రే రంగులలో విడుదల చేశారు. ఈ ఫోన్లను ప్రీ బుకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ల విక్రయాలు ఆగస్టు 19వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. వీవో వీ40 ప్రో, వీవో వీ40 స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్ టచ్ ఓఎస్ 14పై పనిచేస్తాయి. ఇందులో 6.78 అంగుళాల హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే 120హెచ్ జెడ్ రీప్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ నెస్ కలిగి ఉంది. ముఖ్యంగా వీ40 ప్రో ఫోన్ 4ఎన్ఎమ్ మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 12 జీబీ ర్యామ్, 512 జబీ వరకూ స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు వీ40 పోన్ లో 4ఎన్ఎమ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3పై పనిచేస్తుంది.

వీవో వీ40 ప్రోలో ఆరా లైట్ ఫ్లాష్‌ కలిగిన జీస్ బ్రాండ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఆటో ఫోకస్, ఓఐఎస్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50 ఎక్స్ డిజిటల్ జూమ్‌, మరో 50 మెగాపిక్సెల్ సోనీ టెలిఫోటో పోర్ట్రెయిట్ సెన్సార్ తదితర వాటిని అమర్చారు. వీ40కి సంబంధించి ఓఐఎస్, ఏఎఫ్ తో కూడిన 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, మరో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీకి సంబంధించి 5జీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, బీడౌ, గెలీలియో, గ్లోనాస్, వైఫై, యూఎస్ వంటి మంచి మంచి ఫీచర్ లని సైతం ఇందులో అందించారు.