Vivo V30 Launch: మార్కెట్లోకి విడుదల అయిన వివో సరికొత్త స్మార్ట్ ఫోన్… మతిపోగొడుతున్న ఫీచర్లు?

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియో

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 05:00 PM IST

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని ఆవిష్కరించింది. మరి వివో ఆవిష్కరించిన ఆ స్మార్ట్ ఫోన్ ఏది? ఆ స్మార్ట్ ఫోన్ ధర,ఫీచర్ల విషయానికొస్తే.. కాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో వి30 ఫోన్ ni సైలెంటుగా ఆవిష్కరించింది. లేటెస్ట్ వి-సిరీస్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీతో వస్తుంది.

గరిష్టంగా 12జీబీ ర్యామ్‌తో వస్తుంది. వివో వి30 ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3డీ కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ రీబ్రాండెడ్ వివో ఎస్18 మాదిరిగానే కనిపిస్తుంది ఈ హ్యాండ్‌సెట్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. వివో వి30 త్వరలో భారత్ సహా 30 కన్నా ఎక్కువ మార్కెట్లలో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది. వివో వి30 ధరపై క్లారిటీ లేదు. భారత్, ఇండోనేషియా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, యుఎఇతో సహా 30 మార్కెట్‌లలో ఈ హ్యాండ్‌సెట్ త్వరలో లాంచ్ కానుందని వివో ధృవీకరించింది. వివో వి30 సిరీస్ ఫిబ్రవరి 8న మెక్సికోలో లాంచ్ కానుంది. వివో వి30 మోడల్ బ్లూమ్ వైట్, లష్ గ్రీన్, నోబుల్ బ్లాక్, వేవింగ్ ఆక్వా కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

కాగా ఈ వివో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. వివో వి30 ఫోన్ ఆండ్రాయిడ్ 14లో ఫన్‌టచ్ఓఎస్ 14తో నడుస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డి అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 3డీ కర్వ్డ్ డిస్‌ప్లే హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌ని కలిగి ఉంది. డీసీఐ-పీ3 కలర్ ఆప్షన్ 100 శాతం కవరేజీతో పాటు 2800 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. హుడ్ కింద, హ్యాండ్‌సెట్ అడ్రినో 720 జీపీయూతో 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీని కలిగి ఉంది. 8జీబీ +128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ ర్యామ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందిస్తోంది..వివో వి30 ఫోన్ ట్రిపుల్ ఆరా లైట్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఓఐఎస్ 50ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, పోర్ట్రెయిట్ సెన్సార్‌తో కూడిన 50ఎంపీ ఓమ్నివిజన్ ఓవీ50ఈ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో, సెల్ఫీలకు ఆటో ఫోకస్‌తో 50ఎంపీ కెమెరా కూడా ఉంది. వివో వి30 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.