Vivo V29e: మార్కెట్ లోకి మరో వివో స్మార్ట్ ఫోన్.. కెమెరా లవర్స్ కి పండగే?

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలి అంటే ముఖ్యంగా అందులో చూసే ఫీచర్ కెమెరా. ప్రతి ఒకరు కూడా కెమెర

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 07:39 PM IST

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలి అంటే ముఖ్యంగా అందులో చూసే ఫీచర్ కెమెరా. ప్రతి ఒకరు కూడా కెమెరా క్వాలిటీని బట్టి మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేస్తారు ఎటువంటి సందేహం లేదు. అందుకే మొబైల్ తయారీ సంస్థలు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా ఎక్కువగా కెమెరా పైన ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో కూడా అదిరిపోయే కెమెరాతో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇప్పటివరకు మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లేదు చాలా వాటికి 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా వచ్చిన విషయం తెలిసిందే..

కానీ మొట్టమొదటిసారి 50మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వివో వీ29ఈ స్మార్ట్‌ఫోన్‌ ను లాంఛ్ చేసింది. సెల్ఫీ లవర్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది వివో ఇండియా. మరి స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్స్ విషయానికి వస్తే.. వివో వీ29ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999 గా ఉంది. అలాగే ఈ ఫోన్స్ మనకు ఆర్టిస్టిక్ బ్లూ, ఆర్టిస్టిక్ రెడ్ వంటి కలర్స్‌లో లభించనున్నాయి. ఆర్టిస్టిక్ రెడ్ కలర్ మోడల్‌లో కలర్ ఛేంజింగ్ టెక్నాలజీ ఉంది. ప్రీ ఆర్డర్స్ మొదలయ్యాయి. వివో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్లో కొనొచ్చు. సెప్టెంబర్ 7న సేల్ ప్రారంభం అవుతుంది. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. వివో వీ29ఈ ఆఫర్స్ చూస్తే కొన్ని బ్యాంక్ కార్డులపై రూ.2,500 డిస్కౌంట్ లభిస్తుంది. పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.2,000 వరకు అదనంగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.

కొన్ని క్రెడిట్ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రూ.2,500 వరకు అప్‌గ్రేడ్ బోనస్ కూడా పొందవచ్చు. వివో వీ29ఈ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది. ఇది పాపులర్ 5జీ ప్రాసెసర్స్‌లో ఒకటి. ఆండ్రాయిడ్ 13 + ఫన్‌టచ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వివో వీ29ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్ సీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.వివో వీ29ఈ కెమెరా విషయానికి వస్తే..

అలాగే ఇందులో ప్రధానంగా సెల్ఫీ కెమెరా గురించి చెప్పుకోవాలి. ఏకంగా 50మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. ఫ్రంట్ కెమెరాలో నైట్, పోర్ట్రెయిట్, ఫోటో, వీడియో, మైక్రో మూవీ, లైవ్ ఫోటో, డబుల్ ఎక్స్‌పోజర్, హై రిజల్యూషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 64మెగాపిక్సెల్ ప్రైమరీ 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో నైట్, పోర్ట్రెయిట్, ఫోటో, వీడియో, మైక్రో మూవీ, హై రిజల్యూషన్, పనో, లైవ్ ఫోటో, స్లో-మో, టైమ్-లాప్స్, ప్రో, డాక్యుమెంట్స్, డబుల్ ఎక్స్‌పోజర్, డ్యూయల్ వ్యూ, సూపర్‌మూన్, స్టైల్, ఫిల్టర్, లైట్ ఎఫెక్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.