Vivo V27 Pro: త్వరలో విడుదల కానున్న వివో వి27 ప్రో.. ధర, ఫీచర్స్ ఇవే?

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ ల తయారీ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లను మార్కెట్లోకి

  • Written By:
  • Publish Date - February 27, 2023 / 07:00 AM IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ ల తయారీ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వివో సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్ లను తీసుకువస్తోంది. కొత్త కొత్త ఫీచర్ లతో తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే వివో సంస్థ తనపై 5జీ సిరీస్ లో భాగంగా 2023 మార్చి 1న వీ27 మొబైల్స్ ను విడుదల చేయనుంది. మరి వివో విడుదల చేయనున్న ఆ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల గురించి ఇప్పుడు మనం జరుపుకుందాం..

కాగా వివో కంపెనీ వీ27 సిరీస్‍లో వీ27, వీ27 ప్రో విడుదల చేయనుంది. ఈ రెండూ ఫ్లిప్‍కార్ట్‌లో అందుబాటులోకి రానున్నాయి. కాగా వివో వీ27 ప్రో భారత మార్కెట్‍ లోకి మూడు వేరియంట్ లలో అందుబాటులోకి లభించనుంది. అవి 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఉండే వివో వీ27 ప్రో బేస్ మోడల్, 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్, 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ లు కలిగిన ఫోన్స్ ను విడుదల చేయనుంది. ఆ స్మార్ట్ ఫోన్ ధరలు వరుసగా రూ.37,999, రూ.39,999, రూ.42,999 గా ఉన్నాయి. కాగా వివో వీ27 ప్రారంభ ధర రూ.30 వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా ఇప్పటికే వివో వీ27 సిరీస్ కొన్ని స్పెసిఫికేషన్లు కంపెనీ వెబ్‍సైట్, ఫ్లిప్‍కార్ట్‌లో వెల్లడించింది. ఆ ఫీచర్ల విషయానికొస్తే.. వివో వీ27 ప్రో మొబైల్ 3డీ కర్వ్‌డ్ డిస్‍ప్లే కలిగి, 7.4 మిమీ మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇందులో కలర్ చేంజింగ్ గ్లాస్ బ్యాక్‍ కూడా అందుబాటులో ఉంటుంది. వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX766V ప్రధాన కెమెరా. అంతే కాకుండా ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‍టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ మొబైల్ మార్కెట్లో విడుదలవుతుంది.