Vivo V27 Pro: మార్కెట్లోకి వివో వి27 సిరీస్ నుంచి రెండు ఫోన్స్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి ఇప్పటికే నడకలకు మాత్రం మార్కెట్ లోకి విడుదలైన విషయం

  • Written By:
  • Publish Date - March 2, 2023 / 07:30 AM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి ఇప్పటికే నడకలకు మాత్రం మార్కెట్ లోకి విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివో వీ27 సిరీస్‌లో భారీ ఫీచర్స్‌తో వివోవీ27 ప్రో, వివో వీ27 మోడల్స్‌ని పరిచయం చేసింది వివో సంస్థ. ఈ మొబైల్స్‌లో 3డీ కర్వ్‌డ్ స్క్రీన్, 120Hz డిస్‌ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మరి తాజాగా విడుదల చేసిన ఈ రెండు స్మార్ట్ ఫోన్లో వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వివో వీ27 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది.

8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999 కాగా, 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999 గా ఉంది. మార్చి 23న సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ మనకు మ్యాజిక్ బ్లూ, నోబెల్ బ్లాక్ వంటి కలర్స్‌లో లభిస్తోంది. ఈ ఫోన్ ని ఫ్లిప్‌కార్ట్ , వివో ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్ లలో కొనుగోలు చేయవచ్చు. కాగా వివో వీ27 ప్రో స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999 కాగా, 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,99 గా ఉంది. ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.

మార్చి 6న సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది. ఇందులో ఫీచర్స్ విషయానికి వస్తే.. వివో వీ27 సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్లలో ఫీచర్స్ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. వీటిలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. వివో వీ27, వివో వీ27 ప్రో మొబైల్స్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ Sony IMX766V ప్రైమరీ సెన్సార్ 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 2మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. కెమెరాలో వెడ్డింగ్ స్టైల్ పోర్ట్‌రైట్, ఆరా లైట్, పనోరమా, టైమ్ ల్యాప్స్ ఫోటోగ్రఫీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు వీడియోల కోసం ఆటో ఫోకస్ ఫీచర్‌తో 50మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4600 mah బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండ నుంది.