ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అలాగే ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఇది ఇలా ఉంటే స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏది? ఎప్పుడు మార్కెట్ లోకి లాంచ్ కానుంది. లాంచింగ్ డేట్ ఎప్పుడు అన్న వివరాల్లోకి వెళితే.. భారత మార్కెట్లో వివో టీ3 అల్ట్రా ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
ఈ వివో టీ3 అల్ట్రా సెప్టెంబర్ 12న విడుదల చేయనున్నట్లు వివో సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఫోన్ ఇంకా మార్కెట్ లోకి విడుదల కాకముందే ఈ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్లు అలాగే స్పెసిఫికేషన్ల వివరాలు మార్కెట్ లోకి లీక్ అవుతున్నాయి. వివో టీ3 అల్ట్రా ఫోన్ 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ మోడల్ కు ప్రారంభ ధర రూ. 30,999 తో రావచ్చు. 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 32,999, 12జీబీ + 256జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 34,999కి విక్రయించనుంది. కానీ, వివో టీ3 అల్ట్రా అధికారిక ధరలు కావని గమనించాలి. వివో టీ3 అల్ట్రా ఇటీవల లాంచ్ అయిన ఐక్యూ జెడ్9ఎస్ మాదిరిగానే అదే డిజైన్ ను కలిగి ఉందని కంపెనీ లాంచ్ చేసిన అధికారిక టీజర్ ను సూచిస్తుంది. ఇందులో ప్రధాన వ్యత్యాసం రంగు మాత్రమే.
వివో టీ3 అల్ట్రా మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని లీక్‌లు వెల్లడించాయి. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ద్వారా బ్యాకప్ అందిస్తుంది. ఈ హ్యాండ్ సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌తో 6.77 అంగుళాల కర్వ్డ్ స్క్రీన్ ని కలిగి ఉంటుంది. వెనుకవైపు, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ని చూడవచ్చు. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెన్సార్ ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 16ఎంపీ సెన్సార్ ని చూడవచ్చు. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం డ్యూయల్ స్పీకర్ సెటప్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.