Vivo S16 Series: వివో నుంచి మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్స్.. ధర ఫీచర్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వివో సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో వివో సంస్థ ఒకదాని

Published By: HashtagU Telugu Desk
Vivo S16 Series

Vivo S16 Series

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వివో సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో వివో సంస్థ ఒకదాని తర్వాత ఒకటి మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరొక స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వివో వై సిరీస్ లో వివో ఎస్ 16, వివో ఎస్ 16 ప్రో , వివో ఎస్ 16ఈ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది వివో సంస్థ. ఈ మూడు స్మార్ట్‌ ఫోన్‌లు గొప్ప ఫీచర్లు,అలాగే శక్తివంతమైన బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జర్‌తో ఉంటాయి. కాగా ఈ మూడు ఫోన్ ల పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వివో ఎస్ 16 స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇది శక్తివంతమైన Qualcomm Snapdragon 870 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అలాగే 12జీబీ ర్యామ్ మరియు 256జీబీ ఇంబిల్ట్ స్టోరేజ్ పొందింది. ప్రధాన కెమెరా 64ఎంపీ సెన్సార్, రెండవ కెమెరా 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మరియు మూడవ కెమెరా 2ఎంపీ మాక్రో యూనిట్. అంతే కాకుండా, 50ఎంపీ సెన్సార్ సెల్ఫీ కెమెరా తో ఈ మొబైల్ లభించనుంది. వివో ఎస్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పూర్తి హెచ్డీ ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 8200 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది Android 13 ఆధారిత OriginOS 3.0 మద్దతుతో పని చేస్తుంది. అలాగే 12జీబీ రామ్, 512జీబీ ఇంబిల్ట్ స్టోరేజ్ తో లభించనుంది. ప్రధాన కెమెరాలో 50ఎంపీ సెన్సార్ ఉంది. ఇది కాకుండా, ఇది 50ఎంపీ సెన్సార్ సెల్ఫీ కెమెరాతో రానుంది.

వీవో ఎస్‌16ఈ స్మార్ట్‌ఫోన్ 6.62 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది Samsung Exynos 1080 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఉంటుంది. ఇక్కడ ప్రధాన కెమెరా 50ఎంపీ , రెండవ కెమెరా 2ఎంపీ మాక్రో లెన్స్, మూడవ కెమెరా 2ఎంపీ డెప్త్ సెన్సార్. ఇందులో 16ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధరల విషయానికి వస్తే. వీవో ఎస్‌16 ధర సీఎన్‌వై 2,499 అంటే భారతదేశంలో దాదాపు రూ. 29,600 ఉండవచ్చు. అలాగే అలాగే వీవో ఎస్‌16 ప్రో ధర సీఎన్‌వై 3,299 అనగా సుమారు రూ. 39,100 గా ఉంటుంది. వీవో ఎస్‌16 ధర సీఎన్‌వై 2,099 అనగా ఇవి భారత్ లో దాదాపు రూ. 24,900 గా ఉండవచ్చు.

  Last Updated: 25 Dec 2022, 08:58 PM IST