Vivo Y200e: మార్కెట్లోకి విడుదల కాబోతున్న వివో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ మామూలుగా లేవుగా?

చైనాకి చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసి

  • Written By:
  • Updated On - February 19, 2024 / 07:22 PM IST

చైనాకి చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. వివో వై200ఈ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఫిబ్రవరి 22వ తేదీన ఈ ఫోన్ ని లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. Y200కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ వస్తోంది.

ఈ ఫోన్‌ను బ్లూ, ఆరెంజ్ అనే రెండు కలర్ ఆప్షన్‌ లలో లభించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇందులో ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. రిఫ్రెష్ రేట్ 120Hz, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 Gen 2 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ ద్వారా ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 20 వేలలోపు అందుబాటులో ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు.

అలాగే 2-మెగాపిక్సెల్‌తో కూడిన సెకండరీ కెమెరాను అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 44W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీని అందించనున్నారు. ఈ ఫోన్ 6జీబీ, 8జీబీ ర్యామ్‌ ఆప్షన్లతో పాటు 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌ను లాక్/అన్‌లాక్ చేయడానికి ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను డిస్‌ప్లేలో అందించారు.