చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేయనుంది. ఆ వివరాల్లోకి వెళితే.. వివో వై58 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
మరి త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. అయితే త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్లను కంపెనీ ఇప్పటి వరకు ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవేమిటంటే.. ఈ ఫోన్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ 1024 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తున్నారు. 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.
కర్వ్డ్ ఎడ్జెస్‌తో కూడిన సర్క్యులర్ రెయిర్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. కాగా ఇందులో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2 మెగా పిక్సెల్స్‌తో కూడిన షూటర్‌ను కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను సైతం అందించారు. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఇంటర్నల్ మెమోరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ర్యామ్‌ను వర్చువల్‌గా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ స్పీకర్స్, అథంటికేషన్ అండ్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు.