Site icon HashtagU Telugu

Vivo Y18i: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న వివో సరికొత్త స్మార్ట్ ఫోన్?

Vivo Y18i

Vivo Y18i

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వివో సంస్థ భారత మార్కెట్ లోకి ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. ఇటీవల కాలంలో ఎక్కువ శాతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్లో పైనే దృష్టిని పెట్టింది వివో సంస్థ. అందులో భాగంగానే భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. వివో వై78ఐ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.56 ఇంచెస్‌ తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ ను అందించారు.90 హెర్ట్జ్‌ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక 528 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం అని చెప్పవచ్చు. దాంతో ఈ స్మార్ట్ ఫోన్‌ ను సన్‌లైట్‌లో కూడా స్పష్టంగా చూడవచ్చు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత టచ్‌ ఓఎస్‌ 14 వెర్షనపై ఈ ఫోన్‌ చేస్తుంది. ఇందులో 15 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ కెసాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,999గా నిర్ణయించారు. ఇక
కెమెరా విషయానికొస్తే..

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 0.08 ఎంపీతో కూడిన సెకండ్‌ కెమెరాను కూడా ఇచ్చారు. ఇక సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇకపోతే కనెక్టివిటీ వియానికొస్తే.. ఈ ఫోన్‌లో వై-ఫై5, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు. యాక్సెలరో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, అంబియెంట్ లైట్ సెన్సర్ వంటి వాటిని కూడా ఇందులో అందించారు.