Site icon HashtagU Telugu

Vivo Big Joy Diwali: కేవలం రూ.101 లకే స్మార్ట్ ఫోన్ మీ సొంతం.. ఎలా అంటే?

Vivo Big Joy Diwali

Vivo Big Joy Diwali

దేశవ్యాప్తంగా అప్పుడే దీపావళి పండుగ వేడుకలు మొదలయ్యాయి. దీంతో కొన్ని రకాల కంపెనీలు కస్టమర్స్ ని ఆకట్టుకోవడం కోసం రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీంతో వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో తన ఉత్పత్తులపై ఆదర్శనీయమైన ఆఫర్లతో బిగ్ జాయ్ దీపావళి కార్యక్రమాన్ని ప్రకటించింది.

వివో ఎక్స్ 80 సీరీస్, వివో వి 25 సిరీస్, వివో వై 75 సిరీస్, వివో వై 35 సిరీస్ లతో పాటుగా ఇతర వై సిరీస్ ల స్మార్ట్ ఫోన్ లపై ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. దీపావళి పండుగ ఆఫర్ సందర్భంగా వివో ఎక్స్ 80 సిరీస్ పై ఏకంగా రూ.8,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ను చేస్తోంది. నీతో పాటుగా వివో వి 25 సిరీస్ పై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ ను ఇస్తోంది. అయితే ఈ ప్రయోజనాలను ఐసిఐసిఐ, ఎస్బిఐ అలాగే ఇతర బ్యాంకుల క్రెడిట్ డెబిట్ కార్డు, ఈఎంఐ పై అందిస్తోంది వివో సంస్థ.అంతే కాదండోయ్ ముందుగా రూ. 101 చెల్లించిన వారికి ఎక్స్, వి సిరీస్ లో నచ్చిన ఫోన్ ని తీసుకెళ్లవచ్చు అని వివో సంస్థ ప్రకటించింది.

అయితే ఈ ఆఫర్ లో మొదట రూ.101 నుంచి ఆ తర్వాత ఈఎంఐ ద్వారా అమౌంట్ ని కట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై వీవో సంస్థ పూర్తి సమాచారం ఇంకా ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విషయంపై పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని టైలర్ ను సంప్రదించడం ఉత్తమం. అంతేకాకుండా దీవాలి పండుగ ఆఫర్స్ సందర్భంగా రూ.15 వేల కి పైన ఇటువంటి స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసిన ఆరు నెలలు అదనపు వారంటీని ఇస్తున్నట్టుగా తెలిపింది వివో సంస్థ. అదేవిధంగా వై సిరీస్ ఫోన్లను ఇఎంఐపై తీసుకుంటే 2000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టుగా కూడా తెలిపింది. అయితే కేవలం ఈ ఆఫర్స్ అక్టోబర్ 31 వరకు మాత్రమే ఉంటాయని తెలిపింది వివో సంస్థ.

Exit mobile version