VI Offer: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా VI కస్టమర్లకు బంపరాఫర్

స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని టెలికాం సంస్థలు తమ యూజర్లకు అనేక ఆఫర్లను ప్రవేశపెడతాయి. ఆగస్టు 15న దేశంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.

Published By: HashtagU Telugu Desk
VI Offer

New Web Story Copy 2023 08 13t164456.240

VI Offer: స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని టెలికాం సంస్థలు తమ యూజర్లకు అనేక ఆఫర్లను ప్రవేశపెడతాయి. ఆగస్టు 15న దేశంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ పరిస్థితిలో వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. మీరు కూడా వొడాఫోన్ ఐడియా కస్టమర్ అయితే ఈ ఆఫర్‌ను పొందవచ్చు. వినియోగదారులు ఆగస్టు 18 వరకు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.

వొడాఫోన్ ఐడియా వినియోగదారుకు స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌లో 50GB డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. 199 కంటే ఎక్కువ అపరిమిత డేటా రీఛార్జ్‌పై ఈ డేటా ప్రయోజనం పొందవచ్చు. అంతేకాకుండా వొడాఫోన్ ఐడియా వినియోగదారులు 1,449 రీఛార్జ్ ప్యాక్ నుంచి రూ. 50 తగ్గింపును అందిస్తోంది. అదేవిధంగా రూ. 3,099 రీఛార్జ్ ప్యాక్‌పై రూ.75 తక్షణ తగ్గింపును అందిస్తోంది.

వోడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు స్పిన్ ది వీల్ పోటీలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు వొడాఫోన్ ఐడియా కు సంబందించిన డిజిటల్ Vi యాప్‌ని ఉపయోగిస్తుంటే మీరు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఈ పోటీకి సంబంధించి ప్రతి గంటకు ఒక లక్కీ పార్టిసిపెంట్ విజేతగా ప్రకటించబడుతుందని కంపెనీ పేర్కొంది. విజేతగా నిలిచిన లక్కీ పార్టిసిపెంట్‌కు రూ. 3099 రీఛార్జ్ ప్యాక్ అందించబడుతుంది. ఇది మాత్రమే కాకుండా కంపెనీ అదనపు రివార్డ్‌ల కింద 1GB లేదా 2GB అదనపు డేటాను కూడా అందిస్తుంది.

Also Read: Vijay Sales: విజయ్ మెగా సేల్స్.. యాపిల్ లవర్స్ త్వరపడండి

  Last Updated: 13 Aug 2023, 06:07 PM IST