Site icon HashtagU Telugu

Mobile Use: ఫోన్‌ను ఎక్కువ బ్రైట్‌నెస్‌తో ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త?

Mobile Use

Mobile Use

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రతి పదిమందిలో 8 మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. దీంతో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు గంటల కొద్దీ ఫోన్ లోనే గడుపుతున్నారు. కాగా స్మార్ట్ ఫోన్ వల్ల వినియోగాలు ఎన్ని ఉన్నాయో దుష్ప్రభావాలు కూడా అన్నే ఉన్నాయి. మితిమీది స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల అది మీ కళ్ళ పై ప్రభావాన్ని చూపిస్తుంది.

చాలామంది బ్రైట్‌నెస్‌ ను ఎక్కువగా పెట్టుకొని ఫోన్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బ్రైట్‌నెస్‌ కారణంగా స్త్రీ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల కళ్ళు దెబ్బతింటాయి అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా కళ్ళపై ఒత్తిడి కూడా పడుతుంది. ఈ సమస్య దీర్ఘకాలంగా కొనసాగితే క్రమంగా కంటి చూపు ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవర్‌ బ్రైట్‌నెస్‌ కేవలం కంటి ఆరోగ్యంపై మాత్రమే కాకుండా ఫోన్‌ పనితీరు పై కూడా ప్రభావం చూపుతుంది. ఎక్కువ బ్రైట్‌నెస్‌ కారణంగా ఫోన్‌ ఛార్జింగ్ త్వరగా డిశ్చార్జ్‌ అవుతుంది. దీంతో కాలక్రమేణ ఫోన్‌ బ్యాటరీ లైఫ్‌ పై ప్రభావం చూపుతుంది. ఇక బ్రైట్‌నెస్‌ ఎక్కువ ఉండడం వల్ల ప్రాసెసర్‌ పై కూడా ఒత్తిడి పడుతుంది.

ఈ కారణంగా ఫోన్‌ హ్యాంగ్‌ అవ్వడం ప్రారంభమవుతుంది. ప్రాసెసర్‌ పై ఒత్తిడి పెరిగి ఫోన్‌ పనితీరు తగ్గుతుంది. అయితే ఫోన్‌ బ్రైట్‌నెస్‌ మరీ ఎక్కువగా ఉండడం వల్ల అది డిస్‌ప్లే పై కూడా ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా బ్రైట్‌నెస్‌ ఎక్కువగా ఉంటే హీట్‌ జనరేట్ అవుతుంది. దీంతో అది డిస్‌ప్లే పనితీరు పై ప్రభావం చూపుతుంది. కాలక్రమేణా డిస్‌ప్లే పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు బ్రైట్‌నెస్‌ను తగ్గించుకొని మొబైల్ ని యూస్ చేయాలి.