Site icon HashtagU Telugu

iPhone Offer: అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ.4,999 కే ఐఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

iPhone Price Cut

iPhone Price Cut

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది ఒక్కసారి అయిన ఐఫోన్ ని వినియోగించాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ మొబైల్ ధర కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. కొంతమంది ఐఫోన్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ఏదైనా పండుగ ఆఫర్స్ స్పెషల్ ఆఫర్స్ వచ్చినప్పుడు కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా అలాగే కొనుగోలు చేయాలనుకుంటే మీకు ఒక బంపర్ ఆఫర్. ఐఫోన్ ని ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.4,999కే ఐఫోన్‌ 12ని కొనుగోలు చేయవచ్చు.

ఏంటి! ఐఫోన్ కేవలం రూ.5 వేలకే లభించడం ఏంటా అనుకుంటున్నారా! అయితే ఇది తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఐఫోన్ ప్రేమికుల దృష్టి అంతా సెప్టెంబర్‌ 12న రిలీజ్‌ కాబోతున్న ఐఫోన్‌ 15 సిరీస్‌పై ఉంది. ఐఫోన్‌ 15 రాకతో ఐఫోన్‌ 12 వీడ్కోలు తీసుకోనుంది. ఇప్పటికీ యాపిల్‌ అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్‌ 12 ఒకటిగా నిలుస్తోంది. ఐఫోన్‌ 12 కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో రూ.59,900కి లిస్ట్ అయింది. అయితే వినియోగదారులు రూ.52000 భారీ తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.4,999కే సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే 128జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌తో వచ్చే ఐఫోన్ 12 రూ.7,901 డిస్కౌంట్‌ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ.56,999కి లిస్ట్‌ అయింది.

అంతే కాకుండా ఫ్లిప్‌కార్ట్‌ పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేస్తే రూ.50,000 వరకు ఆఫర్‌ అందిస్తోంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్‌ 12 ధర రూ.6,999కి తగ్గుతుంది. దీనితో పాటు, కొనుగోలుదారులు హెచ్డీఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్‌లపై రూ.2000 డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ ఆఫర్‌లు వినియోగించుకుంటే ఐఫోన్‌ 12ని ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.4,999కి కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఈ ఐఫోన్ 12 స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. యాపిల్ ఐఫోన్ 12 ప్రీమియం ఫీచర్ లను అందిస్తోంది. ఇది వ్యాల్యూ ఫర్‌ మనీ స్మార్ట్‌ఫోన్‌. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. ఐఫోన్ A14 బయోనిక్ చిప్ ద్వారా రన్‌ అవుతుంది. సిరామిక్ షీల్డ్, IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. డివైజ్‌ వెనుక భాగంలో 12ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. నైట్ మోడ్, 4కే డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌తో 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తుంది. వెర్టికల్‌ డ్యూయల్ కెమెరా సెటప్, 64జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌తో వచ్చిన యాపిల్‌ చివరి మోడల్ ఇదే అవుతుంది..