Site icon HashtagU Telugu

Use Emojis Carefully : ఎడాపెడా ఎమోజీ వాడినందుకు 50 లక్షలు కట్టాల్సి వచ్చింది

Use Emojis Carefully

Use Emojis Carefully

Use Emojis Carefully : ఎమోజీలను ఎడాపెడా వాడేస్తున్నారా ? 

అయితే కాసేపు ఆగి ఈ వార్తను చదవండి.. 

ఏ మెసేజ్ కు పడితే ఆ మెసేజ్ కు.. ఎమోజీలతో ఎడాపెడా రిప్లై ఇస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..

అలర్ట్ అయిపోండి !!

Also read : Rs 355 Crores For Personal Security : ఏడాదికి 115 కోట్లు.. ఆ బిజినెస్ మ్యాన్ పర్సనల్ సెక్యూరిటీ ఖర్చు

మనిషి వేలిముద్ర వేసినా.. సంతకం చేసినా అంగీకారానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇటీవల కాలంలో డిజిటల్ సిగ్నేచర్స్ కూడా వచ్చేశాయి.. నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న నేటి మనిషి ఏదైనా మెసేజ్ కు రిప్లై ఇవ్వడానికి ఎమోజీలను ఎక్కువగా వాడుతున్నాడు.  అయితే ఏది వాడటానికి అయినా ఒక లిమిట్ ఉంటుంది. ఏ ఎమోజీ ఎప్పుడు వాడాలి ? ఎందుకు  వాడాలి ? అనే దానిపై మనకు కొంత అవగాహన ఉండాలి. సమయం, సందర్భాన్ని బట్టి మనం రియాక్ట్ కావాలి. ప్రతిచోటా ఎమోజీలనే వాడితే సమస్యలు చుట్టుముట్టే రిస్క్ ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి ఇటువంటి సమస్యనే(Use Emojis Carefully) ఎదుర్కొన్నాడు. అదేంటో చూద్దాం..     

కెనడాలో ఇటీవల నడిచిన కేసు ఇది.. సౌత్ వెస్ట్ టెర్మినల్ అనేది రైతుల నుంచి  ధాన్యం కొనే కంపెనీ. క్రిస్ అచ్టర్ అనే అతడు ఒక రైతు. 2021 మార్చిలో సౌత్ వెస్ట్ టెర్మినల్  నుంచి  రైతు క్రిస్ అచ్టర్ కు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది.  “40 కేజీల అవిసె గింజల బ్యాగ్ ను  రూ.1000 చొప్పున ధరకు కొంటాం. మాకు మొత్తం 86 టన్నుల  అవిసె గింజలు కావాలి ” అని ఆ టెక్స్ట్  మెసేజ్ లో ఉంది. ఈ మెసేజ్ చూశాక రైతు క్రిస్ అచ్టర్ ఫోన్‌ చేసి సౌత్ వెస్ట్ టెర్మినల్ కంపెనీ ప్రతినిధితో మాట్లాడాడు. ఆ తర్వాత 2021 నవంబర్‌లో సౌత్ వెస్ట్ టెర్మినల్  నుంచి రైతు క్రిస్ అచ్టర్ వాట్సాప్ కు  ఒక ఫోటో వచ్చింది. “దయచేసి అవిసెల  అమ్మకం ఒప్పందాన్ని నిర్ధారించండి” అని అందులో ఉంది. ఆ ఫోటోను డౌన్ లోడ్ చేసుకున్న రైతు .. దానికి థంబ్స్ అప్ ఎమోజితో రిప్లై ఇచ్చాడు. దీంతో  తమకు అవిసె గింజలు అమ్మే అగ్రిమెంట్ కు రైతు క్రిస్ అచ్టర్ అంగీకరించాడని  సౌత్ వెస్ట్ టెర్మినల్ కంపెనీ భావించింది. కానీ డెడ్ లైన్ గడుస్తున్నా.. అగ్రిమెంట్ ప్రకారం రైతు క్రిస్ అచ్టర్ నుంచి అవిసె గింజలు రాకపోవడంతో సౌత్ వెస్ట్ టెర్మినల్ కంపెనీ కోర్టును ఆశ్రయించింది.

Also read : IND vs PAK: టీమిండియా పాకిస్థాన్ రాకుంటే మేము కూడా ఇండియాకి రాలేం.. పాకిస్థాన్ క్రీడా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..!

కోర్టులో ఆసక్తికర వాదనలు.. 

కోర్టుకు వచ్చిన రైతు.. ” నేను ఆ ఫోటో రిసీవ్ అయ్యిందని చెప్పేందుకు మాత్రమే థంబ్స్ అప్ ఎమోజితో రిప్లై ఇచ్చాను.. ఆ అగ్రిమెంట్ కు నేను ఓకే చెప్పలేదు” అని వివరించాడు. అయితే గతంలో చాలామంది రైతులు థంబ్స్ అప్ ఎమోజితో అగ్రిమెంట్ కు ఓకే చెప్పిన స్క్రీన్ షాట్లను సౌత్ వెస్ట్ టెర్మినల్ కంపెనీ కోర్టుకు సబ్మిట్ చేసింది. అవిసె  గింజలను రైతు సకాలంలో తమకు డెలివరీ చేయకపోవడంతో నష్టం జరిగిందని.. అందుకు పరిహారాన్ని ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కోర్టు ఆ థంబ్స్ అప్  ఎమోజీని  సంతకానికి సమానమైన అర్ధం ఇచ్చే సందేశంగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చింది. అగ్రిమెంట్ ను ఉల్లఘించినందుకు రైతు క్రిస్ అచ్టర్ కు రూ.50 లక్షల పరిహారాన్ని  సౌత్ వెస్ట్ టెర్మినల్ కంపెనీకి చెల్లించాలని ఆదేశించింది.  అందుకే.. మీరు కూడా ఎమోజీలు వాడేటప్పుడు అలర్ట్ గా ఉండండి.

Exit mobile version