Google Chrome Sale : ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్.. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి తొలుత గుర్తుకొచ్చేది ‘గూగుల్’. ఒకరకంగా చెప్పాలంటే ఇంటర్నెట్‌కు మారుపేరుగా గూగుల్ మారింది. గూగుల్‌కు చెందిన గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశంలో కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఈ బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్ సెర్చింజన్ మార్కెట్‌లో గూగుల్ మకుటం లేని మహారాజుగా అవతరించింది. ఈవిధంగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సాధించిన ఏకఛత్రాధిపత్యానికి సాక్షాత్తూ గూగుల్ పుట్టినిల్లు అమెరికాలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్ ఏకఛత్రాధిపత్యంపై అమెరికా ప్రభుత్వ న్యాయశాఖ అలుపెరుగని న్యాయపోరాటం చేస్తోంది. గూగుల్ కంపెనీ మాతృ సంస్థ పేరు ఆల్ఫాబెట్. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించేలా ఆల్ఫాబెట్‌పై ఒత్తిడిని పెంచాలని అమెరికా న్యాయశాఖ భావిస్తోంది.
Also Read :Gold Loan EMI : ఇక గోల్డ్ లోన్స్‌కూ ‘ఈఎంఐ’ ఆప్షన్స్.. ఎలా అంటే..
ఇంటర్నెట్ మార్కెట్‌లో గూగుల్ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్‌ను విచారించే క్రమంలో ఒక న్యాయమూర్తి ఈ ఏడాది ఆగస్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంటర్నెట్ సెర్చింజన్ మార్కెట్‌లో గూగుల్(Google Chrome Sale) అక్రమంగా ఏకఛత్రాధిపత్యం సాధించింది’’ అని ఆయన కామెంట్ చేశారు.ఆ న్యాయమూర్తికి చెందిన ధర్మాసనం వద్ద ఒక పిటిషన్ దాఖలు చేయాలని అమెరికా న్యాయశాఖ భావిస్తోంది.
Also Read :Mens Day 2024 : కవితను చదివి వినిపించిన మహేశ్ బాబు.. ‘మెన్స్ డే’ ప్రత్యేక పోస్ట్
ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో గూగుల్ అక్రమ ఆధిపత్యం నడిపిస్తోందని ఆ పిటిషన్‌లో ప్రస్తావించాలని యోచిస్తోంది. గూగుల్ క్రోమ్‌ను ఆల్ఫాబెట్ విక్రయించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయశాఖ కోరే అవకాశం ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్‌ను వేరు చేయమని అడగడంతో పాటు గూగుల్‌లో యాడ్స్ ఇచ్చే వారికి సంబంధించిన మరింత సమాచారాన్ని బహిరంగంగా అందుబాటులో ఉంచాలని అమెరికా న్యాయశాఖ పిటిషన్‌లో ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ఈ అంశాలపై అమెరికా న్యాయశాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.