Site icon HashtagU Telugu

UPI Transaction: ఇక మీదట ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ ట్రాన్సాక్షన్స్.. అదిలా అంటే?

Upi Transaction

Upi Transaction

ప్రస్తుత రోజుల్లో యూపీఐ ట్రాన్సాక్షన్ల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నచిన్న టీ కొట్టు బండ్ల నుంచి పెద్దపెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు ప్రతి ఒక్క ప్రదేశంలో ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే ఇంటర్నెట్ అన్నది తప్పనిసరి. కొన్ని కొన్ని సార్లు మనం ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సరిగ్గా అమౌంట్ అయిపోవడం, అమౌంట్ లేకపోవడం వల్ల యూపీఏ ట్రాన్సాక్షన్స్ జరగక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్మార్ట్‌ఫోన్ కొనలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. కానీ ఇంటర్నెట్ లేకుండా కూడా యూపీఐ ద్వారా చెల్లింపు చేయవచ్చట.

ఇది మాత్రమే కాదు యూపీఐ సాధారణ కీప్యాడ్ ఫోన్ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చట. దీని కోసం ఒక ప్రత్యేక USSD కోడ్ అవసరం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) *99# సేవను ప్రారంభించింది. దీని ద్వారా మీరు ఇంటర్నెట్ లేకుండా బ్యాంకింగ్ సేవలను ఉపయోగించవచ్చు. ఈ సేవ కింద మీరు మీ బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపవచ్చు. చెల్లింపును కూడా స్వీకరించవచ్చట. ఇది కాకుండా, బ్యాలెన్స్‌ని చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. యూపీఐ పిన్‌ ని సెట్ చేయడం ద్వారా ఈ లావాదేవీలు చేయవచ్చు. కాగా ఇంటర్నెట్ లేకుండా యూపీఐ ద్వారా డబ్బు పంపడానికి సులభమైన మార్గాల విషయానికి వస్తే..

మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయాలి. తర్వాత బ్యాంకింగ్ సేవల మెను స్క్రీన్‌ పై కనిపిస్తుంది. అక్కడ కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్, ట్రాన్సాక్షన్స్, యూపీఐ పిన్ ఇలాంటివి కనిపిస్తాయి. డబ్బు పంపడానికి ‘1’ అని టైప్ చేయాలి. డబ్బు పంపే పద్ధతిని ఎంచుకోండి. మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, సేవ్ చేయబడిన లబ్ధిదారు మొదలైనవి. సంబంధిత నంబర్‌ని టైప్ చేసి పంపు ఆప్షన్‌పై నొక్కండి. తర్వాత మీరు మొబైల్ నంబర్ ద్వారా బదిలీని ఎంచుకుంటే, డబ్బు పంపే వ్యక్తి యూపీఐ కి లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. బదిలీ చేయడానికి మొత్తాన్ని నమోదు చేయడం మంచిది. మీకు కావాలంటే, మీరు చెల్లింపుతో పాటు ఏదైనా సందేశం కూడా రావచ్చు. లావాదేవీని పూర్తి చేయడానికి మీ యూపీఐ పిన్‌ని నమోదు చేయాలి. తర్వాత ఇంటర్నెట్ లేకుండానే మీ యూపీఐ లావాదేవీ విజయవంతమవుతుంది.