Site icon HashtagU Telugu

Smartphones: వచ్చేనెల విడుదల కానున్న కొత్త స్మార్ట్ ఫోన్స్.. ధర ఫీచర్స్ ఇవే?

Smartphones

Smartphones

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో నెలలో పదుల సంఖ్యలో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతూనే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తో మంచి మంచి స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి ఆయా సంస్థలు. ఇది ఇలా ఉంటే ఏప్రిల్ నెల దాదాపు పూర్తి కావస్తోంది. మే నెల మొదలు కావడానికి మరి కొద్ది రోజులు మాత్రమే సమయముంది. ఈ నేపథ్యంలోనే మే నెలలో కొన్ని కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. మరి మే నెలలో విడుదల కాబోతున్న ఆ స్మార్ట్ ఫోన్లు వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గూగుల్​ పిక్సెల్​ 7ఏ.. 2023 మే నెలలో విడుదలకానున్న స్మార్ట్​ఫోన్ లలో గూగుల్​ పిక్సెల్​ 7ఏ కూడా ఒకటి. వచ్చే నెల 10న జరగనున్న గూగుల్​ ఐ/ఓ 2023 ఈవెంట్​ వేదికగా ఈ మొబైల్ విడుదల కానుందని సమాచారం. ఈ మొబైల్ ఫోన్ ఆధునిక డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 6.1 ఇంచెస్​ అమోలెడ్​ డిస్​ప్లే కలిగిన గూగుల్​ పిక్సెల్​ 7ఏ 64ఎంపీ సోనీ ఐఎంఎక్స్​787 కెమెరా, లేటెస్ట్​ టెన్సార్​ జీ2 చిప్​సెట్​, 4500 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్స్​ కలిగి ఉండే అవకాశం ఉంటుందని అంచనా.

ఈ స్మార్ట్ ఫోన్ ధర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గూగుల్​ పిక్సెల్​ ఫోల్డ్.. గూగుల్ విడుదల చేయబోతున్న పిక్సెల్​ ఫోల్డ్ మొబైల్ మే 10న లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5.8 ఇంచెస్​ కవర్​ డిస్​ప్లే, 7.69 ఇంచెస్​ ఇన్నర్​ డిస్​ప్లే స్క్రీన్స్ కలిగి అద్భుతమైన కెమెరా ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. అలాగే రియల్​మీ 11 ప్రో.. ఈ ఫోన్ నెలలో 11 ప్రో లాంచ్ చేయబోతన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ 7000 సిరీస్​ చిప్​సెట్​ కలిగి 108ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్​ కమెరా సెటప్ తో రానుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్, ధరలు త్వరలోనే ప్రకటించనున్నారు. రియల్​మీ 11 ప్రో ప్లస్​.. మే 2023లో విడుదలకానున్న మరో రియల్​మీ మొబైల్ 11 ప్రో ప్లస్. ఇది వచ్చే నెలలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇది దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమ డిజైన్, ఫీచర్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.